Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ అతన్ని వదిలిపెట్టట్లేదుగా..?

బిగ్ బాస్ సీజన్ 9 సందడి మొదలైంది. సీజన్ 9 ని ఇప్పటివరకు జరిగిన 8 సీజన్ల కన్నా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   7 Sept 2025 11:21 AM IST
బిగ్ బాస్ అతన్ని వదిలిపెట్టట్లేదుగా..?
X

బిగ్ బాస్ సీజన్ 9 సందడి మొదలైంది. సీజన్ 9 ని ఇప్పటివరకు జరిగిన 8 సీజన్ల కన్నా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ గా థీం ప్లాన్ చేశారు. అందులో భాగంగానే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒక షో పెట్టి అందులో నుంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ కి పంపించారు. బిగ్ బాస్ సీజన్ మొదలు కాకముందే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఓటింగ్ మొదలవడం ఇదే మొదటిసారి.

హౌస్ రహస్యాలు బయట పెట్టేది..

బిగ్ బాస్ సీజన్ మొదలైంది అంటే షో ని నడిపించేది హోస్ట్ నాగార్జున అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి హౌస్ రహస్యాలను బయట పెట్టేది మరో హోస్ట్. అదే బిగ్ బాస్ బజ్ లో హోస్ట్ గా చేసే కంటెస్టెంట్స్. బిగ్ బాస్ ని ఎంతగా చూస్తారో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూస్ కూడా అదేలా చూస్తారు. ఎందుకంటే హౌస్ లో జరిగే విషయాల గురించి బీబీ బజ్ లోనే ఓపెన్ అవుతారు కంటెస్టెంట్స్. ఎలిమినేషన్స్ రీజన్స్ నుంచి హౌస్ లో ఎవరు రియల్, ఎవరు ఫేక్ అన్నది కూడా చెప్పేస్తారు.

బిగ్ బాస్ సీజన్ 9 షో నేటి నుంచి స్టార్ట్ అవుతుండగా బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరన్న కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. ఐతే బిగ్ బాస్ టీం ఆల్రెడీ బీబీ బజ్ హోస్ట్ ని ఫిక్స్ చేశారట. ఈసారి ఒక హోస్ట్ కాదు ఇద్దరు హోస్ట్ లు బజ్ ఇంటర్వ్యూస్ చేస్తారట. అందులో ఒకరు బిగ్ బాస్ సీజన్ 7 కి వచ్చిన శివాజీ ఉన్నాడట. మరో పక్క బిగ్ బాస్ సీజన్ 7, 8 కవర్ చేసిన టేస్టీ తేజా కూడా ఉన్నాడట.

బిగ్ బాస్ బజ్ శివాజి, టేస్టీ తేజ హోస్ట్..

సో బిగ్ బాస్ సీజన్ 9 కి సంబందించిన బిగ్ బాస్ బజ్ ని శివాజి, టేస్టీ తేజ హోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబందించిన ప్రోమో త్వరలో వస్తుందట. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న మొదలవుతుంది. సో బీబీ 9 ఫస్ట్ ఎలిమినేషన్ సెప్టెంబర్ 14న జరుగుతుంది. ఆ వీకెండ్ బీబీ బజ్ లో ఎవరు వస్తారు.. వాళ్లని శివాజి, టేస్టీ తేజ ఎలాంటి ప్రశ్నలు అడిగి సమాధానాలు రప్పిస్తారన్నది చూడాలి.

బిగ్ బాస్ కి వచ్చి వెళ్లాక శివాజి కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ జోష్ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 కి వెళ్లిన ఆయన టాప్ 3 లో ఉన్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా ఒకసారి స్టేజ్ మీదకు గెస్ట్ గా వచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఇప్పుడు బీబీ బజ్ కి హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్ బాస్ శివాజీని అసలు వదలట్లేదని ఆడియన్స్ అనుకుంటున్నారు.