బిగ్ బాస్ 9.. భరణి మెడిసిన్ తో ఆడుకున్న సంజన.. పాపం దివ్య..!
బిగ్ బాస్ సీజన్ 9లో సంజన చేసే కొన్ని పనులు ఆమె కామెడీ అనుకుంటుంది కానీ అవతల వారికి ఎఫెక్ట్ అవుతాయి.
By: Ramesh Boddu | 28 Nov 2025 10:34 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో సంజన చేసే కొన్ని పనులు ఆమె కామెడీ అనుకుంటుంది కానీ అవతల వారికి ఎఫెక్ట్ అవుతాయి. హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ ని ఎంపిక చేసేందుకు అంతకుముందు సీజన్లలో వారిని తీసుకొచ్చారు. వాళ్లంతా సంజన మొదటి వారాల్లో బాగా యాక్టివ్ గా ఉందని అన్నారు. అంటే ఆమె దొంగతనం చేస్తూ కంటెంట్ ఇచ్చిన టైం లో బెటర్ అనిపించిందని అన్నారు. అందుకే ఆమె మళ్లీ ఆ ఫన్ ని మొదలు పెట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో భరణి మెడిసిన్స్ ని తీసుకుని దాచేసింది సంజన.
భరణి, సంజన, ఇమ్మాన్యుయెల్ మాట్లాడుతున్న టైం లో..
కెప్టెన్ రీతుకి ఆ విషయం చెప్పి ఎవరైనా సరే మళ్లీ తీసిన దగ్గర పెట్టమని చెప్పమని భరణి అన్నాడు. ఐతే తనూజ సంజన గారే తీశారని చెప్పగా రీతు వెళ్లి అడిగితే ఆమె లేదు నేను తీయలేదని అన్నది. ఐతే భరణి నైట్ పడుకునేప్పుడు కావాల్సిన కాల్షియం టాబ్లెట్స్ వరకు ఒక పేపర్ లో పెట్టింది సంజన. దివ్య వాటిని చూసి ఉన్నాయ్ కదా అంటే లేదు బాటిల్స్ కనబడట్లేదని అన్నాడు.
సంజన ఈ ఇష్యూలో భరణికి తనకు చిన్న ఇష్యూ ఉంది అది క్లియర్ చేయాలి అందుకే దాచేశా అంటుంది మధ్యలో ఇమ్మాన్యుయెల్ కూడా అది టాబ్లెట్స్ అలా చేయొద్దు అని చెప్పినా సంజన ఇవ్వదు. ఐతే బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా భరణి, సంజన, ఇమ్మాన్యుయెల్ మాట్లాడుతున్న టైం లో దివ్య మళ్లీ కలగచేసుకుంటుంది. అప్పుడు భరణి దివ్య మీద అరుస్తాడు. ప్రతి దానిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు.. మధ్యలో ఎందుకు వస్తున్నావ్ ఇక్కడ ముగ్గురు మాట్లాడుతున్నాం కదా అని ఫైర్ అవుతాడు.
భరణి మెడిసిన్ దాచేసి ఫన్ చేద్దామని..
దివ్య భరణిని మాట్లాడకుండా చేస్తుంది అంటూ హౌస్ లోకి వచ్చిన వారంతా చెప్పడంతో అలా అతను దివ్య మీద ఓపెన్ అవుతున్నాడు. ఫైనల్ గా సంజన తను భరణి మెడిసిన్ దాచేసి ఫన్ చేద్దామని అనుకున్నా కానీ ఎవరు దానికి సపోర్ట్ చేయలేదని డైరెక్ట్ గా భరణికే చెప్పింది. ఈ విషయంలో దివ్య ఓవర్ ఇన్వాల్వ్ మెంట్ వల్ల భరణి తన మీద ఫైర్ అయ్యేలా చేసుకుంది. సో భరణి ఇదే ఫైర్ ముందు వారాల నుంచి చూపిస్తే ఆట వేరేలా ఉండేదని ఆడియన్స్ అంటున్నారు.
ఇప్పటికీ రాబోతున్న 3 వారాల్లో ఎలాగైనా ఆట టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టాప్ 5లో ఉండేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి టాప్ 5కి కూడా టఫ్ ఫైట్ కొనసాగుతుంది.
