Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. అతని సెల్ఫ్ ఎలిమినేషన్ రీజన్స్ ఏంటి..?

రాము రాథోడ్ ఒక ఫోక్ సింగర్ కమ్ డాన్సర్.. ఆ క్రేజ్ తోనే అతను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. చాలా చిన్న వయసు అతనిది.. కష్టపడి సంపాదించుకున్న స్థానం అతనిది.

By:  Ramesh Boddu   |   9 Nov 2025 10:20 AM IST
బిగ్ బాస్ 9.. అతని సెల్ఫ్ ఎలిమినేషన్ రీజన్స్ ఏంటి..?
X

బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం శనివారం ఎపిసోడ్ లో ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో మొదటి నుంచి తన ఆట తను ఆడుతూ వస్తున్న అతను హోం సిక్ ఫీల్ అవుతున్నాడు. దాదాపు గత వారం మొత్తం పరధ్యానంలో ఉంటూ వచ్చాడు. అంతేకాదు నైట్ నిద్ర కూడా పోవట్లేదట. హోస్ట్ నాగార్జున ఏంటని అడిగి.. కాస్త పుష్ చేసే ప్రయత్నం చేసినా తను ఇంట్లో ఉండలేకపోతున్నా భయమవుతుంది అని హౌస్ నుంచి వెళ్లిపోయాడు. ఇంతకీ హౌస్ నుంచి సెల్ఫ్ ఎవిక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అంటే రాము రాథోడ్ అని తెలుస్తుంది.

ఫోక్ సింగర్ కమ్ డాన్సర్ రాము రాథోడ్..

రాము రాథోడ్ ఒక ఫోక్ సింగర్ కమ్ డాన్సర్.. ఆ క్రేజ్ తోనే అతను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. చాలా చిన్న వయసు అతనిది.. కష్టపడి సంపాదించుకున్న స్థానం అతనిది. ఐతే హౌస్ లో ఎత్తులు పైఎత్తులు అతనికి నచ్చలేదు. పరిస్థితులు అన్నీ అతన్ని ఒంటరి వాడిని చేశాయి. హౌస్ లో తనని ఎప్పుడు పుష్ చేసే వాళ్లు ఉన్నా కూడా ఇంకా ఇంకా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. అదే శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ముందు వ్యక్తపరిచాడు.

రాము రాథోడ్ ఎంత బాధపడుతున్నాడు అన్నది మాటల్లో చెప్పలేక ఒక పాటతో చెప్పాడంటే అతను లోలోపల ఎంత మదన పడుతున్నాడు అన్నది అర్ధం చేసుకోవచ్చు. అంత బలవంతంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇంటి దగ్గర తన పేరెంట్స్ తో పాటు ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో అన్న బెంగ పెట్టుకున్నాడు రాము. అందుకే ఆ పరధ్యానంలో ఉంటూ ఆట మీద సరిగా ఫోకస్ చేయలేకపోతున్నాడు. హోస్ట్ నాగార్జున నీ ఫైనల్ డెసిషన్ ఏంటి అంటే నేను వెళ్లిపోతా అని అన్నాడు.

సెల్ఫ్ ఎలిమినేషన్ ఆడియన్స్ కి షాక్..

రాము రాథోడ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్.. శనివారం ఎపిసోడ్ లో రాము బయటకు వచ్చాడు. అతని సెల్ఫ్ ఎలిమినేషన్ ఆడియన్స్ కి కూడా షాక్ ఇచ్చింది. హౌస్ లో ఇంతమంది ఉండి రాము అలా ఒంటరిగా ఫీల్ అవుతుంటే ఇది హౌస్ ఫెయిల్యూర్ కూడా అని నాగార్జున హౌస్ మేట్స్ ని ప్రశ్నించారు.

ఐతే రాము వాళ్ల తప్పేమి లేదు ఎప్పటికప్పుడు తనతో మాట్లాడుతున్నారని తానే మింగిల్ అవ్వలేకపోతున్నా అని చెప్పాడు. ఫైనల్ గా రాము ఎగ్జిట్ వల్ల హౌస్ లో సంఖ్య ఒకటి తగ్గింది. ఈరోజు సండే ఎలిమినేషన్ ప్రాసెస్ యధావిధిగా ఉంటుంది. ఈరోజు శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అవుతాడని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 తొమ్మిది వారాల ఆట ముగిసే సరికి స్ట్రాంగ్ పీపుల్ ఇంకాస్త స్ట్రాంగ్ అవుతున్నారు.. కొందరు కంటెస్టెంట్స్ తమ ఆటతో రేసులోకి వస్తున్నారు.