Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వడానికి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒక షో స్టార్ట్ చేశారు.

By:  Ramesh Boddu   |   19 Aug 2025 10:54 AM IST
బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వడానికి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒక షో స్టార్ట్ చేశారు. ఈసారి బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ ని కూడా ఎక్కువమందిని తీసుకొచ్చే క్రమంలో బిగ్ బాస్ టీం కామన్ మ్యాన్ నుంచి ఎంట్రీస్ కోరింది. వారి నుంచి 45 మందిని ఫైనల్ చేశారు. వారి నుంచి బిగ్ బాస్ 9 కి 9 మంది కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేస్తారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఐతే ఈ షోని ఆగష్టు 22 నుంచి జియో హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేస్తారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎలిమినేట్..

రీసెంట్ గా బిగ్ బాస్ అగ్నిపరీక్షకు సంబంధించిన ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో ఒక హ్యాండికాప్డ్ గాయ్ తన గురించి చెప్పాడు. నవదీప్ అతని గురించి తెలుసుకుని సీట్ మీద నుంచి లేచి మరీ అప్రిషియేట్ చేశాడు. ఐతే అతను బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ప్రోమో చూసి అతను సెలెక్ట్ అవుతారని అనుకున్నారు. కానీ అక్కడిదాకా వచ్చిన అతను బిగ్ బాస్ 9 లో ఛాన్స్ అందుకోలేదు.

అతనితో పాటు మరొకరు కూడా ఎలిమినేట్ అయ్యారట. బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో పాల్గొంటున్న 45 మందిలో ఆల్రెడీ 15 మందిని వడకడతారట. ఆ 15 మెంబర్స్ లో నుంచి ఐదుగురు అగ్నిపరీక్ష నుంచి వస్తారట. మిగిలిన నలుగురి కోసం డైరెక్ట్ గా ఆడియన్స్ ఓటింగ్ తో ఎంపిక చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో 9 మంది సెలబ్రిటీస్, 9 మంది కామన్ మ్యాన్ ఉంటారని తెలుస్తుంది. ఈ 9 మంది కామన్ మ్యాన్ ఎవరన్నది షో స్టార్ట్ అయ్యే టైం కు తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్..

ఇక బిగ్ బాస్ సీజన్ 9 కి వచ్చే సెలబ్రిటీస్ లిస్ట్ లో జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, అలేఖ్య పికిల్స్ రమ్య, జానీ, దువ్వాడ మాధురి, సీరియల్ యాక్టర్ శివ్, ఒకప్పటి హీరోయిన్ ఆశా షైనీ ఉన్నారని తెలుస్తుంది. వీరితో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ సీజన్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారట. బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ గా షో రసవత్తరంగా ఉండబోతుందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి మొదలవుతుంది. 3 నెలల పాటు బిగ్ బాస్ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా సీజన్ 9 రెడీ అవుతుంది.