బిగ్ బాస్ 9.. పాపం అందరు కలిసి ఆమెను బయటకు నెట్టేశారు..!
బిగ్ బాస్ సీజన్ 9లో శుక్రవారం ఊహించని ట్విస్ట్ జరిగింది. ఈ వారం అసలు నామినేషన్స్ లో లేని ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు.
By: Ramesh Boddu | 27 Sept 2025 9:29 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో శుక్రవారం ఊహించని ట్విస్ట్ జరిగింది. ఈ వారం అసలు నామినేషన్స్ లో లేని ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. ఇంతకీ అసలేం జరిగింది అంటే బిగ్ బాస్ ఇచ్చిన ఫ్రూట్స్ లో బ్లూ సీడ్ అందుకున్న వారికి ఇంటి నుంచి మెసేజ్.. బ్లాక్ సీడ్ అందుకున్న వారికి ఇమ్యునిటీ టాస్క్ ఇవ్వగా రెడ్ సీడ్ అందుకున్న వారు హౌస్ లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే అంటే ఇంటి నుంచి బయటకు పంపించే ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో వాళ్లంతా మెజారిటీ పీపుల్ సంజనాకే ఓటేశారు.
ఆమెను ఎలా ఎలిమినేట్ చేసిన్రు..
సంజనా వల్ల ఇంట్లో అనవసరమైన గొడవలు వస్తున్నాయని.. దొంగతనాలు చేస్తూ హౌస్ మెట్స్ ని ఇబ్బంది పెడుతుందని హరీష్ అన్నాడు. రాము రాథోడ్, డీమాన్ పవన్, కళ్యాణ్ కూడా దానికి ఓటేశారు. ఫలితంగా ఉన్నపళంగా సంజనాని హౌస్ నుంచి బయటకు పంపించాడు బిగ్ బాస్. ఐతే అసలు సంజన ఈ వారం నామినేషన్స్ లో లేదు. ఆమె కన్నా హౌస్ లో అనవసరమైన క్యాండిడేట్స్ ఉన్నారు. అప్పుడు ఆమెను ఎలా ఎలిమినేట్ చేస్తారని ఆడియన్స్ అంటున్నారు.
అంతేకాదు ఆడియన్స్ చేత ఎలిమినేట్ అయితేనే అది కన్ ఫర్మ్ ఎలిమినేషన్.. అలా కాకుండా ఈ హౌస్ మెట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ అంతా కూడా బిగ్ బాస్ ఆటలో భాగమే అని తెలిసిందే. సో సంజనాని సీక్రెట్ రూం కి పంపిస్తారు. ఐతే సంజనా ఎలిమినేషన్ అనగానే ఇమ్మాన్యుయెల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇన్ని సీజన్లు చూస్తున్నా కూడా ఇలా మిడ్ వీక్ ఎలిమినేట్ చేసిన వారు సీక్రెట్ రూం కి వెళ్తారని ఇమ్మాన్యుయెల్ కి తెలియదా అంత ఎమోషనల్ ఎందుకు అంటూ కొందరు అంటున్నారు.
దివ్య నిఖిత హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే..
ఏది ఏమైనా మిడ్ వీక్ లో ఒక కొత్త కంటెస్టెంట్ హౌస్ లోకి రాగా.. మరో కంటెస్టెంట్ బయటకు వచ్చారు. దివ్య నిఖిత హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే హౌస్ లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. ఇంకా చాలా మార్పులు జరిగేలా ఉన్నాయి. ఆమె కామనర్స్ కి బయట వాళ్లు ఎలా పోట్రే అవుతున్నారన్న విషయాన్ని చెబుతుంది అన్న టాక్ ఉంది. మొత్తానికి సీజన్ 9 ఎపిసోడ్ లో ఆడియన్స్ అంతా కూడా ఎంగేజ్ అయ్యేలానే కంటెంట్ నడిపిస్తున్నారు బిగ్ బాస్ టీం.
బిగ్ బాస్ సీజన్ 9లో సజనాని హౌస్ మెట్స్ ఎలిమినేట్ చేసినా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
