బిగ్ బాస్ 9.. బీబీ రాజ్యంలో ఒకరాజు ఇద్దరు రాణులు..!
ఇక గురువారం ఎపిసోడ్ లో మరోసారి రాజు, కమాండర్స్ మధ్య టాస్క్ జరిగింది. రాజుగా ఉన్న కళ్యాణ్ టాస్క్ ఆడేందుకు ముందుకు వచ్చాడు.. మరోపక్క కమాండర్స్ నుంచి తనూజ, దివ్య పేరు ప్రజలు ఫైనల్ చేశారు.
By: Ramesh Boddu | 14 Nov 2025 9:59 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం ఇమ్యూనిటీతో పాటు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. బీబీ రాజ్యంలో రాజు, రాణి, కమాండర్, ప్రజలు ఇలా బిగ్ బాస్ ముందు రాజు రాణిలను ఎంపిక చేసి వారి ద్వారా కమాండర్స్ ని ఎంపిక చేశారు. మిగిలిన వారు ప్రజలుగా ఉన్నారు. ఐతే వారి వారి స్థానాలు పదిలపరచుకోవడానికి లేదా ప్రమోట్ అవ్వడానికి కొన్ని టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. ఆల్రెడీ బుధవారం టాస్క్ లో దివ్యపై నిఖిల్ గెలిచి రాజుగా ప్రమోట్ అవ్వగా.. దివ్య రాణి నుంచి కమాండర్ గా మారింది.
తనూజ గెలిచి రాణిగా ప్రమోట్..
ఇక గురువారం ఎపిసోడ్ లో మరోసారి రాజు, కమాండర్స్ మధ్య టాస్క్ జరిగింది. రాజుగా ఉన్న కళ్యాణ్ టాస్క్ ఆడేందుకు ముందుకు వచ్చాడు.. మరోపక్క కమాండర్స్ నుంచి తనూజ, దివ్య పేరు ప్రజలు ఫైనల్ చేశారు. ఐతే టాస్క్ ఆడాల్సిన కళ్యాణ్ దివ్య, తనూజలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉండగా బిగ్ బాస్ అడగ్గానే తనూజ అని కళ్యాణ్ అన్నాడు. తనూజ, కళ్యాణ్ కు ఒక టాస్క్ ఇవ్వగా అందులో తనూజ గెలిచి రాణిగా ప్రమోట్ అయ్యింది. కళ్యాణ్ ఈ టాస్క్ ఓడిపోయి కమాండర్ గా మారాడు.
ప్రస్తుతం బీబీ రాజ్యంలో నిఖిల్ రాజుగా ఉండగా రీతు, తనూజ రాణులుగా ఉన్నారు. వీరి ముగ్గిరికి టాస్క్ పెట్టి అందులో గెలిచిన వారిని కెప్టెన్ చేస్తారు. ఐతే ఈరోజు ఆ టాస్క్ లో తనూజ గెలిచి ఈ వారం కెప్టెన్ గా అవుతుందని తెలుస్తుంది. దాదాపు 10 వారాల్లో ఐదో వారం నుంచి ఆమె కెప్టెన్ గా చివరి దాకా వచ్చి ఓడిపోతుంది. ఫైనల్ గా 10వ వారం తనూజ కెప్టెన్ అయ్యింది.
సంజయ్ తుమ్మ బీబీ రాజ్యంలో రుచికరమైన భోజనాలు..
బీబీ రాజ్యంలో రాజు, రాణిలతో పాటు కమాండర్స్ కి కూడా మంచి రుచికరమైన భోజనాలు అందిచాడు. సంజయ్ తుమ్మ హౌస్ లోకి వచ్చి వాళ్లకు ఆ భోజన సదుపాయాన్ని కలిగించారు. తన అసిస్టెంట్ కుక్ తో మంచి రుచికరమైన ఐటమ్స్ చేయించి వాళ్లకు అందించాడు. ఐతే రాజుగా ఉన్న కళ్యాణ్, నిఖిల్, రాణి రీతు మంచి భోజనం పొందారు. అప్పటికి కమాండర్స్ గా ఉన్న తనూజ, సంజన, డీమాన్ పవన్, దివ్య కూడా కొన్ని స్పెషల్ ఐటమ్స్ వారికి భోజనంగా వచ్చాయి. ఐతే ప్రజలకు మాత్రం సాధారణ వెగ్ భోజనం అందించారు. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగానే అలా సంజయ్ వచ్చి హౌస్ మేట్స్ కి రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు.
హౌస్ లో ఫుడ్ కొరత.. అది కూడా ఇష్టమైన నాన్ వెజ్ వంటకాలు కుదరవు.. అందుకే రాజు, రాణిలకు వచ్చిన స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్స్ చూసి హౌస్ లో వాళ్లంతా కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. ఫుడ్ కోసం హౌస్ లో ఎంత ఎదురుచూపులు ఉన్నాయో ఇది చూసిన ఆడియన్స్ కు అర్థమవుతుంది.
