Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. విన్నర్ రేసులో సడెన్ ఎంట్రీ గా ఆ కంటెస్టెంట్..?

బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి ఆరుగురు హౌస్ మేట్స్ బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లగా వారిలో ఇద్దరు మాత్రమే ఇప్పటికీ హౌస్ లో కొనసాగుతున్నారు. వారిలో కళ్యాణ్ పడాల ఉన్నాడు.

By:  Ramesh Boddu   |   9 Nov 2025 11:37 AM IST
బిగ్ బాస్ 9.. విన్నర్ రేసులో సడెన్ ఎంట్రీ గా ఆ కంటెస్టెంట్..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో 9 వారాల తర్వాత ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. ఇప్పటివరకు హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ గా ఉన్న వారిలో వారాలు గడుస్తున్నా కొద్దీ ప్లేసులు మారుతున్నాయి. ముఖ్యంగా ఒక కంటెస్టెంట్ అది కూడా కామనర్ గా వచ్చి హౌస్ లో పాతుకుపోయాడు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో ఫ్రెండ్ షిప్, గొడవలు వారి కోసం సాక్రిఫైజ్ ఇవన్నీ అతని మైలేజ్ ని పెంచేస్తున్నాయి. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారు కదా అతనే ఆర్మీ నుంచి బిగ్ బాస్ కి అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల.





అగ్నిపరీక్ష నుంచి ఆరుగురు హౌస్ మేట్స్..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి ఆరుగురు హౌస్ మేట్స్ బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లగా వారిలో ఇద్దరు మాత్రమే ఇప్పటికీ హౌస్ లో కొనసాగుతున్నారు. వారిలో కళ్యాణ్ పడాల ఉన్నాడు. అతనితో పాటు డీమాన్ పవన్ కూడా ఉన్నాడు. కళ్యాణ్ పడాలకు తనూజతో ఫ్రెండ్ షిప్ బాగా కలిసి వచ్చింది. ఆమెను ఇష్టపడుతున్నట్టు చెప్పిన కళ్యాణ్ ఆమె కోసం కొన్ని సాక్రైఫైజ్ లు చేయడం ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

ఎలాగు కళ్యాణ్ పడాలకు ఆడియన్స్ లో మొదటి నుంచి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇక ఈమధ్య అతను టాస్క్ లతో పాటు తనూజ కోసం కొన్నిసార్లు స్టాండ్ తీసుకోవడం తో మరింత ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. మధ్యలో శ్రీజ వచ్చి మళ్లీ అతన్ని గాడి తప్పించాలని ప్రయత్నించినా తన ఒరిజినాలిటీతో కళ్యాణ్ పడాల ఆట ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

టాప్ 5లో తను కూడా ఉండేందుకు అన్ని అర్హతలు..

ఇక ఈ సీజన్ టాప్ 5లో తను కూడా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయనేలా కళ్యాణ్ పడాల ఇంప్రెస్ చేస్తున్నాడు. శనివారం ఎపిసోడ్ లో తనూజ కోసం తను రెండు వారాలు డైరెక్ట్ నామినేట్ అవ్వాలని అనుకోవడం అతన్ని వద్దని తనూజ వారించడం చూసి ఆడియన్స్ ఈ ఇద్దరి ఫ్రెండ్ షిప్ బాగుందని అంటున్నారు. తనూజ, కళ్యాణ్ ఒకటై ఆట ఆడితే ఇద్దరు కూడా టాప్ ప్లేస్ లో ఫైనల్ వీక్ దాకా ఉండే ఛాన్స్ ఉందనిపిస్తుంది. అంతేకాదు ఈ సీజన్ లో ఇమ్మాన్యుయెల్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్ గా కొనసాగుతుండగా అతన్ని వెనక్కి నెట్టి కళ్యాణ్ ముందుకు వెళ్లడానికి కూడా స్కోప్ ఉందని చెప్పుకుంటున్నారు.

ఇక 9 వారాల ఆటలో ఎవరి స్థానం ఏంటన్నది శనివారం ఎపిసోడ్ లో ఆడియన్స్ జడ్జిమెంట్ ఇచ్చారు. టాప్ 6లో కళ్యాణ్ నాలుగో ప్లేస్ లో ఉన్నాడు. సో ఆటని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఆడితే మాత్రం తప్పకుండా ఈ సీజన్ మరో కామన్ మ్యాన్ ఊహించని విధంగా విజేతగా నిలిచే ఛాన్స్ ఉంది. మరి అది జరగాలంటే కళ్యాణ్ పడాల ఇక సీరియస్ గేమ్ మోడ్ స్విచ్ ఆన్ చేయాల్సిందే.