Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. టైటిల్ రేసులో కామనర్..?

మొన్నటిదాకా తనూజ, ఇమ్మాన్యుయెల్ టాప్ 2గా కనిపించగా కళ్యాణ్ పడాల పెరిగిన గ్రాఫ్ చూస్తే ఈ ఇద్దరికీ టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉన్నారు.

By:  Ramesh Boddu   |   7 Dec 2025 10:31 AM IST
బిగ్ బాస్ 9.. టైటిల్ రేసులో కామనర్..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ టైటిల్ రేసులో దూసుకెళ్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ ని అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. అగ్నిపరీక్ష నుంచి ఆరుగురు కామనర్స్ సెలెక్ట్ అవగా వారిలో ఇద్దరు మాత్రం ఇప్పటికీ హౌస్ లో కొనసాగుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పుడు టైటిల్ రేసులో కూడా కామనర్ దూసుకెళ్తున్నాడు. సీజన్ 9లో స్ట్రంగ్ గా తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్నాడు కళ్యాణ్ పడాల. ఆర్మీ నుంచి బిగ్ బాస్ ఛాన్స్ కోసం అగ్నిపరీక్షకు వచ్చిన అతను అక్కడ జడ్జిలను ఇంప్రెస్ చేశాడు.

ఆట మీద అతనికి ఉన్న క్లారిటీ..

ఐతే సీజన్ 9లో మొదట్లో మామూలుగానే అనిపించిన కళ్యాణ్ పడాల. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో అప్పటి నుంచి మరింత పుంజుకున్నాడు. ముఖ్యంగా అతని సిన్సియారిటీ ఆట మీద అతనికి ఉన్న క్లారిటీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఇక బయట ఆడియన్స్ లో కూడా కళ్యాణ్ పడాలకు మంచి ఫాలోయింగ్ పెరిగింది.

మొన్నటిదాకా తనూజ, ఇమ్మాన్యుయెల్ టాప్ 2గా కనిపించగా కళ్యాణ్ పడాల పెరిగిన గ్రాఫ్ చూస్తే ఈ ఇద్దరికీ టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం బయట ఉన్న బజ్ చూస్తుంటే ఈ సీజన్ విన్నర్ గా కామనర్ అయిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తుంది.

నాగార్జున కూడా సెల్యూట్..

బిగ్ బాస్ సీజన్ 9లో నిన్న శనివారం ఎపిసోడ్ లో కూడా కళ్యాణ్ పడాల ఆటకి అతను ఫస్ట్ ఫైనలిస్ట్ గెలవడంతో నాగార్జున ఇంప్రెస్ అయ్యాడు. నువ్వు దానికి డిజర్వ్ అని చెప్పాడు. కళ్యాణ్ నాగార్జునకు సెల్యూట్ కొట్టగా నాగార్జున కూడా తిరిగి సెల్యూట్ కొట్టాడు. కళ్యాణ్ పడాలకి ఇస్తున్న ఎలివేషన్స్ కూడా భారీగా ఉంది. చూస్తుంటే బయట ఉన్న బజ్ దృష్ట్యా బిగ్ బాస్ టీం కూడా అతనికి ఎలివేషన్ ఇస్తున్నట్టు ఉంది.

బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ పడాలతో పాటు తనూజ, ఇమ్మాన్యుయెల్ టైటిల్ రేసులో ఉన్నారు. ఈ ముగ్గిరిలో ఎవరికి ఈ టైటిల్ దక్కుతుందో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 6లో కామనర్ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. ఐతే అతని రైతు బిడ్డగా ప్రేక్షకుల్లో సింపతీ ఏర్పరచుకుని అలా టైటిల్ గెలిచాడు. ఐతే కామనర్ గా ఈసారి ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాలకు ఆ ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటికే ఆడియన్స్ ఒక క్లారిటీకి వచ్చారు. రేసులో ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ ఉండగా కళ్యాణ్ కే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయని టాక్ నడుస్తుంది. తనూజ, ఇమ్మాన్యుయెల్ కి ధీటుగా కళ్యాణ్ అన్నివిధాలుగా తన ఆట, మాట తీరుతో ఆకట్టుకుంటున్నాడు.