Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఆ కంటెస్టెంట్ బయటకు వస్తాడా..?

బిగ్ బాస్ సీజన్ 9 లో కామన్ర్స్ ని అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక చేసి హౌస్ లోకి పంపించారు. అలా ఈ సీజన్ లో 9 మంది సెలబ్రిటీస్ తో పాటు ఆరుగురు కామనర్స్ హౌస్ లో ఛాన్స్ అందుకున్నారు.

By:  Ramesh Boddu   |   16 Sept 2025 11:23 AM IST
బిగ్ బాస్ 9.. ఆ కంటెస్టెంట్ బయటకు వస్తాడా..?
X

బిగ్ బాస్ సీజన్ 9 లో కామన్ర్స్ ని అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక చేసి హౌస్ లోకి పంపించారు. అలా ఈ సీజన్ లో 9 మంది సెలబ్రిటీస్ తో పాటు ఆరుగురు కామనర్స్ హౌస్ లో ఛాన్స్ అందుకున్నారు. అందులో మాస్క్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హరీష్ కూడా ఉన్నాడు. అగ్నిపరీక్ష టైం లో అతని ఎంట్రీనే మాస్క్ తో ఇచ్చాడు. అతను ఆ టైంలో చేసిన కామెంట్స్ కి బిందు మాధవి అతని మెడలో లూజర్ బోర్డ్ కూడా వేసింది. కానీ మళ్లీ ఆమే హౌస్ లోకి వెళ్లే కామన్ర్ గా సెలెక్ట్ చేసింది.

హరీష్ మనసులో పెట్టుకుని కొనసాగిస్తున్నారు..

ఐతే హరీష్ హౌస్ లో వ్యవహరిస్తున్న తీరు చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నామంటేనే ఒకరు పెద్దగా కారణాలు ఏమి లేకపోయినా కూడా తమ మీద మాటలు అంటారు. టార్గెట్ చేస్తారు కానీ హరీష్ కి ఇవేవి నచ్చట్లేదు. తనతో పెట్టుకున్న వాళ్లందరి మీద పగ పెంచుకుంటున్నట్టు ఉన్నాడు. గొడవ జరిగింది సార్ట్ అవుట్ చేసుకున్నాక అంతా సర్దుకోవాలి కానీ హరీష్ మాత్రం దాన్ని మనసులో పెట్టుకుని కొనసాగిస్తున్నారు.

ఈ విషయంలో ఆడియన్స్ కూడా అప్సెట్ లో ఉన్నారు. మొన్న సండే ఎపిసోడ్ జరిగిన నాటి నుంచి అతను ఏమి తినకుండా ఎంటీ స్టమక్ తో ఉంటున్నాడు. హౌస్ మెట్స్ చెప్పినా వినట్లేదు. ఇలాంటి వ్యవహార శైలి కచ్చితంగా హౌస్ లో ఉండకూడదు. మరి హరీష్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అన్నది అర్ధం కావట్లేదు. తాను బిగ్ బాస్ ప్రేమికుడిని.. బిగ్ బాస్ ని ఎంతగానో ఇష్టపడతాను అంటూ చెప్పిన హరీష్ తీరా బిగ్ బాస్ కి వచ్చాక ఇలా ప్రవర్తించడం ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది.

హరీష్ గేం ప్లాన్ తెలియదు కానీ

బిగ్ బాస్ హౌస్ లో ఏం చేసినా సరే ఎంటర్టైన్ చేయాలి. మరి హరీష్ గేం ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ అతన్ని హౌస్ లో నుంచి బయటకు పంపించేస్తే బెటర్ అనుకుంటున్నారు ఆడియన్స్. హరీష్ ఇలానే ఎంటీ స్టమక్ తో ఉన్నాడంటే.. బిగ్ బాస్ చెప్పినా ఏమి తినకపోతే మాత్రం అతన్ని హౌస్ నుంచి బయటకు పంపించే ఛాన్స్ ఉంటుంది.

బిగ్ బాస్ కి వచ్చి అలుగి కూర్చుంటా.. అందరి మీద అరుస్తా అంటే కుదరదు. మరి హరీష్ మైండ్ లో ఏం నడుస్తుందో తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ 9 ఛాన్స్ ని అతను మిస్ యూజ్ చేసుకుంటున్నాడని చెప్పొచ్చు.