Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఫ్లోరా లక్కు మామూలుగా లేదు..!

బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీ కేటగిరిలో వచ్చిన ఫ్లోరా షైనీ లక్ బాగుంది.

By:  Ramesh Boddu   |   25 Sept 2025 9:47 AM IST
బిగ్ బాస్ 9.. ఫ్లోరా లక్కు మామూలుగా లేదు..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీ కేటగిరిలో వచ్చిన ఫ్లోరా షైనీ లక్ బాగుంది. ఫస్ట్ వీక్ లోనే నామినేషన్స్ లో ఉన్న ఆమె చివరి దాకా వెళ్లి వచ్చింది. అంటే ఫస్ట్ వీక్ ఆమె లీస్ట్ 2 గా ఉంది. ఇక నెక్స్ట్ వీక్ అంటే రెండో వారం ఆమె ముందే సేఫ్ అయ్యింది. ఐతే థర్డ్ వీక్ లో కూడా ఆమెను నామినేషన్స్ లో ఉంచారు హౌస్ మెట్స్. మిగతా వారిలా ఆమె నామినేషన్స్ అంటే భయపడట్లేదు. ఐతే ఇప్పటికే ఫ్లోరా షైనీ మీద ఆడియన్స్ లో ఒక సింపతీ వర్క్ అవుట్ అవుతుంది.

బ్లాక్ సీడ్ ఉన్న వారికి ఇమ్యూనిటీ..

ఐతే ఈ వారం హౌస్ లో బిగ్ బాస్ హౌస్ మెట్స్ కి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి ఎవరు ఎలా ఆడుతున్నారు అన్నది ఆ ఫ్రూట్ లో ఉన్న సీడ్ ని బట్టి తెలుస్తుందని అన్నాడు. ఆల్రెడీ బ్లూ కలర్ సీడ్ దొరికిన వాళ్లకి ఫ్యామిలీస్ నుంచి ఒక మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక బ్లాక్ సీడ్ ఉన్న వారికి ఇమ్యునిటీ ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఐతే బ్లాక్ సీడ్ శ్రీజ, ఫ్లోరా షైనీ, రీతు చౌదరి దగ్గర ఉంది. ఇక ఇందులో ఒక బాల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

అందులో గెలిచిన వారు ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యునిటీ పొందుతారు. ఐతే శ్రీజ, రీతు చౌదరి, ఫ్లోరా షైనీ ఈ ముగ్గురిలో టాస్క్ గెలిచినందుకు ఫ్లోరా ఈ వారం ఇమ్యునిటీ లభించింది. సో నామినేషన్స్ నుంచి ఆమెని తీసేశారు. ఫైనల్ గా ఫ్లోరా షైనీకి లక్ బాగా కలిసి వచ్చి 3వ వారం కూడా బాగానే సర్వైవ్ అవుతుంది. ఈ వీక్ మొత్తం ఆమెను జైల్ లో ఉంచారు. లాస్ట్ సండే ఎపిసోడ్ లో మోస్ట్ బోరింగ్ గా హౌస్ లో అందరి కన్నా ఆమెకే ఎక్కువ ఓట్స్ వచ్చాయి. అందుకే ఆమెను జైల్ లో వేశారు.

3 వారాలు నామినేషన్స్ లో ఫ్లోరా షైనీ..

ఐతే నాలుగుర్ రోజులు జైల్ లో ఉండి ఈ వారం ఇమ్యునిటీ కూడా సాధించింది ఫ్లోరా షైనీ.. దాదాపు 3 వారాలు నామినేషన్స్ లో ఉండి సేఫ్ అయ్యింది ఆమె. తప్పకుండా మరో రెండు మూడు వారాలు ఆమె హౌస్ లో ఉండే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో సరికొత్త ట్విస్ట్ లతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. కామనర్స్ నుంచి ఒకరు హౌస్ లోకి పర్మినెంట్ గా వచ్చారని తెలుస్తుంది. మరోపక్క దసరా రోజు ఈ సీజన్ 2.ఓ మొదలు పెడతారట. అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది.