బిగ్ బాస్ 9.. ఫైనల్ ఎపిసోడ్ కి అతను దూరమా..?
ఎందుకంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వెళ్లిన అతను నాలుగు వారాలకే హ్యాండ్సప్ చెప్పాడు. హౌస్ లో అతను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు.
By: Ramesh Boddu | 1 Dec 2025 9:40 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ ఎపిసోడ్ లో ఈ సీజన్ లో పాల్గొన్న అందరు అటెండ్ అవుతారు. ఏ సీజన్ లో లేని విధంగా ఈ సీజన్ ఫస్ట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారితో పాటుగా వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వారిని కూడా ఫైనల్ ఎపిసోడ్ లో కనిపిస్తారు. ఐతే ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్స్ వెరైటీగా ఫైర్ స్టోర్మ్ అంటూ ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు మరో కామనర్ దివ్య కూడా 3వ వారంలో హౌస్ లోకి వచ్చింది.
ఎపిసోడ్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ తో..
ఇక ఒకసారి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన భరణి మరో ఛాన్స్ అందుకుని హౌస్ లోకి వచ్చాడు. ఇలా ఏ సీజన్ లో లేని విధంగా సీజన్ 9ని నడిపించారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ తో పాటుగా టాప్ 5 ఒక్కొక్కరుగా హౌస్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ మీదకు వస్తారు. వారిలో టాప్ 2 ని హోస్ట్ నాగార్జున స్టేజ్ మీదకు డైరెక్ట్ గా ఆయనే తీసుకొస్తారు.
ఐతే ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ లో మాస్క్ మ్యాన్ హరిత హరీష్ కనిపించే ఛాన్స్ లేదని టాక్. ఎందుకంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వెళ్లిన అతను నాలుగు వారాలకే హ్యాండ్సప్ చెప్పాడు. హౌస్ లో అతను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఉన్న టైం లోనే గొడవలు, అలకలు, అన్ హెల్తీ ఇష్యూస్ జరిగాయి. ఫైనల్ గా మాస్క్ మ్యాన్ బయటకు వచ్చాక కూడా మళ్లీ బిగ్ బాస్ పేరు ఎత్తలేదు. అంతేకాదు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఒక వారం నామినేట్ చేయాల్సి ఉండగా.. అందరు వచ్చారు కానీ హరీష్ మాత్రం రాలేదు.
మాస్క్ మ్యాన్ హరిత హరీష్..
బిగ్ బాస్ పిలిచినా సరే అతను ఇక ఆ షోకి రానని చెప్పాడట. సో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో కూడా ఈ సీజన్ కి సంబందించిన అందరు వస్తారు కానీ మాస్క్ మ్యాన్ హరిత హరీష్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. సో హరీష్ కావాలనే ఇలా చేస్తున్నాడా.. బిగ్ బాస్ తనకు ఇష్టమైన షో అని చెప్పి అక్కడ ఉండలేక బయటకు వచ్చిన అతను ఫైనల్ ఎపిసోడ్ కి వస్తాడా లేదా అన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.
బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అయితే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వాఅ కామనర్స్ ఎంపిక జరిగిందో.. నెక్స్ట్ రాబోయే సీజన్లకు కూడా అగ్నిపరీక్ష ద్వారా కొందరిని హౌస్ లోకి పంపిస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1 ఈ ఇయర్ పూర్తి కాగా సీజన్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం.
