Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ గెస్ట్ ఎవరు..?

ఈ రెండిటిలో రాజా సాబ్ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ప్రభాస్ ని గెస్ట్ గా పిలిస్తే పాన్ ఇండియా లెవెల్ లో బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ క్రేజ్ తెచ్చుకుంటుందని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుందట.

By:  Ramesh Boddu   |   18 Dec 2025 10:10 AM IST
బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ గెస్ట్ ఎవరు..?
X

బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ 21న జరుగుతుంది. దాదాపు 105 రోజుల పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తమ స్థానాలు తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. టాప్ 5లో ఎవరు ముందు ఎవరు వెనుక అనే సమీకరణాలు ఇప్పటికే చాలా వినిపిస్తున్నాయి. విజేతగా ఎవరు ప్రేక్షకుల చేత గెలిపించబడతారో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి హోస్ట్ నాగార్జునతో పాటు మరో చీఫ్ గెస్ట్ కూడా వస్తుంటారు. గత రెండు సీజన్లుగా కింగ్ నాగార్జునే విజేతని అనౌన్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ కి..

ఐతే ఈసారి అలా కాకుండా ఒక స్టార్ హీరోని బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగు సంక్రాంతికి భారీ సినిమాల రిలీజ్ లు ఉన్నాయి. వాటి ప్రమోషన్స్ కి తగినట్టుగానే ఇలా ఆ మూవీ ప్రమోషన్ తో పాటు ఆ స్టార్ బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ గా వస్తారని టాక్. ఐతే సంక్రాంతి సినిమా రిలీజ్ లో మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ఉంది.

ఈ రెండిటిలో రాజా సాబ్ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ప్రభాస్ ని గెస్ట్ గా పిలిస్తే పాన్ ఇండియా లెవెల్ లో బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ క్రేజ్ తెచ్చుకుంటుందని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుందట. ప్రభాస్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. చిరంజీవి ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు. మరోసారి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఒక సర్ ప్రైజ్ అతిథి..

బిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ గెస్ట్ ఎవరన్నది డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. గెస్ట్ లు ఎవరు లేకుండా నాగార్జున సింగిల్ హ్యాండ్ తో అయినా చేస్తారు. కానీ ఎవరో ఒక సర్ ప్రైజ్ అతిథి ఉంటే ఆడియన్స్ కి మరింత ఎగ్జైట్ మెంట్ ఉంటుందని అంటున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో విన్నింగ్ రేసులో ఇద్దరు కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్నారు. ఐతే అనూహ్యంగా ఈ వారం డీమాన్ పవన్ ఓటింగ్ ఒక రేంజ్ లో పెరిగింది.

మొన్నటిదాకా టాప్ 4 లో ఉన్న అతను ఇప్పుడు 3వ స్థానానికి వచ్చేలా ఉన్నాడు. కళ్యాణ్, తనూజ మధ్య టైటిల్ ఫైట్ రసవత్తరంగా నడుస్తుంది. దాదాపు ఈ ఇద్దరిలోనే ఒకరు ఈ సీజన్ విన్నర్ ఉండొచ్చని చెబుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ కోసం భారీ ప్లాన్స్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. దానితో పాటు ఫైనల్ ఎపిసోడ్స్ లో చాలామంది గెస్ట్ లు సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది.