బిగ్ బాస్ 9.. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ట్విస్ట్ ఏంటంటే..?
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం కెప్టెన్ తనూజ, ఆమె ద్వారా కాపాడబడిన రీతు చౌదరి తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా నామినేషన్స్ లో ఉన్నారు.
By: Ramesh Boddu | 21 Nov 2025 10:45 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం కెప్టెన్ తనూజ, ఆమె ద్వారా కాపాడబడిన రీతు చౌదరి తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా నామినేషన్స్ లో ఉన్నారు. అఫ్కోర్స్ ఈ వారం సుమన్ శెట్టిని కూడా ఎవరు నామినేట్ చేయలేదు. ఈ నామినేషన్స్ నుంచి ఈ వారం ఎవరు సేఫ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. తనూజ, రీతుని వదిలేస్తే హౌస్ లో భరణి, ఇమ్మాన్యుయెల్, సంజన, దివ్య, కళ్యాణ్, డీమాన్ పవన్, ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ తర్వాత ఈ వీక్ పెద్దగా టాస్క్ లు ఆడింది కూడా ఏమి లేదు.
ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వారి ఆట గురించి రివ్యూ..
ఎందుకంటే ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ కాబట్టి కంటెస్టెంట్ కి సంబందించిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హౌస్ లో ఉన్న వాళ్లకు మంచి బూస్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వారి ఆట గురించి పూర్తి రివ్యూ ఇవ్వడమే కాకుండా వాళ్లు ఏ స్థానంలో ఉన్నారు. ఎవరు స్ట్రాంగ్ అన్నది కూడా చెప్పారు. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారంతా కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు.
నామినేషన్స్ లో ఉన్న వారిలో కళ్యాణ్ పడాలకు టాప్ ఓటింగ్ పడుతున్నాయని తెలుస్తుంది. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్, భరణి, డీమాన్ పవన్ కూడా దూసుకెళ్తున్నారు. ఎటొచ్చి సంజన, దివ్య ఈ ఇద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వారం దివ్య హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దివ్య ఎలిమినేషన్ దాదాపు గ్యారెంటీ అనే అంటున్నారు.
మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్..
ఆమె హౌస్ లో ఆట కన్నా మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంతేకాదు భరణి మీద సర్వ హక్కులు తనవే అన్నట్టుగా ఆమె ప్రవర్తించే తీరు ఇబ్బంది కరంగా ఉంది. ఇంకా మిగిలిన 4 వారాల్లో హౌస్ లో ఉన్న వీక్ కంటెస్టెంట్స్ కచ్చితంగా బయటకు రావాల్సిందే. ఈ క్రమంలో దివ్య నిఖిత ఎలిమినేట్ జరుగుతుందని టాక్. ఐతే అఫీషియల్ ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం సాయత్రం ఎపిసోడ్ లో తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ రేసులో కళ్యాణ్ ఊహించని విధంగా వచ్చేశాడు. మొన్నటిదాకా తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయెల్ ఉన్న సమీకరణాలు కాస్త కళ్యాణ్, తనూజ మధ్య జరిగేలా మారాయి. చూస్తుంటే ఈ సీజన్ కూడా ఒక కామనర్ ని ఆడియన్స్ విన్నర్ చేసే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే తనూజ, ఇమ్మాన్యుయెల్ ఫాలోవర్స్ కూడా కళ్యాణ్ కి తగిన పోటీ ఇచ్చేలా ఓటింగ్ చేస్తున్నారు.
