ఆమె వల్లే ఇమ్మాన్యుయెల్ వెనకపడ్డాడా..?
బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ ఆల్ రౌండర్ ప్రదర్శన అందరు ఎంజాయ్ చేశారు. సీజన్ ఐదారు వారాల్లో ముగుస్తుంది అంటే 10వ వారం వరకు ఇమ్మాన్యుయెల్ విన్నర్ మెటీరియల్ ఆయన తర్వాత సెకండ్ ప్లేస్ లో తనూజ అనేలా వైబ్ ఉంది
By: Ramesh Boddu | 25 Dec 2025 9:00 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ ఆల్ రౌండర్ ప్రదర్శన అందరు ఎంజాయ్ చేశారు. సీజన్ ఐదారు వారాల్లో ముగుస్తుంది అంటే 10వ వారం వరకు ఇమ్మాన్యుయెల్ విన్నర్ మెటీరియల్ ఆయన తర్వాత సెకండ్ ప్లేస్ లో తనూజ అనేలా వైబ్ ఉంది. హౌస్ మేట్స్ కూడా ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఇమ్మాన్యుయెల్ ని ఉంచారు. తనూజ తోనే తన టఫ్ ఫైట్ అని ఇమ్మాన్యుయెల్ కూడా భావించాడు. కానీ ఊహించని విధంగా ఇద్దరు కామనర్స్ కళ్యాణ్, డీమాన్ పవన్ ఇద్దరు అతన్ని దాటుకు వెళ్లారు. కళ్యాణ్ ఏకంగా టైటిల్ గెలుచుకున్నాడు.
బిగ్ బాస్ బజ్ ఇమ్మాన్యుయెల్ ఇంటర్వ్యూ..
ఇమ్మాన్యుయెల్ ఫోర్త్ ప్లేస్ లో ఎలిమినేట్ అవ్వడం అతన్నే కాదు ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ తర్వాత టాప్ 5 ఇంటర్వ్యూస్ బిగ్ బాస్ బజ్ ద్వారా చేశాడు శివాజి. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్ ఇంటర్వ్యూ గురించి అందరు ఎదురుచూస్తుండగా లేటెస్ట్ గా దానికి సంబందించిన ప్రోమో రిలీజైంది. ఇమ్మాన్యుయెల్ ని బెస్ట్ ఎంటర్టైనర్ అంటూ లాఫింగ్ బుద్ధ కానుకగా ఇచ్చాడు శివాజి.
ఇక ఆటలో ఇమ్మాన్యుయెల్ వెనకపడడానికి రీజన్ ఏదై ఉంటుందని అడిగాడు. ఐతే తనతో బాగానే ఉంతూ తనపై ఆట ఆడారంటూ ఇన్ డైరెక్ట్ గా కళ్యాణ్, డీమాన్ గురించి చెప్పాడు ఇమ్మాన్యుయెల్. ఇక సంజనాతో ఎక్కువ ఉండటం వల్లే ఇలా అయ్యిందని అనుకుంటున్నావా అని శివాజి అడిగితే అవునని అన్నాడు ఇమ్మాన్యుయెల్. ఆమెతో ఉండటం తో పాటు నామినేషన్స్ లో ఎక్కువ రాకపోవడంతో తనకు పడాల్సిన ఓట్లు అన్నీ ఆమెకు పడ్డాయి కావొచ్చని అన్నాడు ఇమ్మాన్యుయెల్.
ఎక్కువసార్లు నామినేషన్స్ లోకి రాకపోవడం..
ఐతే శివాజీ మాత్రం బిగ్ బాస్ 9 సీజన్లలో 3 సార్లు కెప్టెన్ అయ్యింది నువ్వు ఒక్కడివే అంటూ ఇమ్మాన్యుయెల్ ని ప్రశంసించారు. మొత్తానికి ఇమ్మాన్యుయెల్ తన ఆట చూసుకున్నాక ఎక్కువ సంజనాతో ఉండి కంటెంట్ ఇవ్వడంతో పాటు ఎక్కువసార్లు నామినేషన్స్ లోకి రాకపోవడం కూడా ఇమ్మాన్యుయెల్ ని ఆడియన్స్ కి దూరం చేసింది. అందుకే అతను టాప్ 2 లో ఉండాల్సింది టాప్ 4 కి వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ ఆట తీరు ఎంటర్టైన్ చేసిన విధానం అంతా కూడా అదరగొట్టేసింది. టైటిల్ విన్నర్ లేదా రన్నరప్ గా అయినా ఉంటాడని అనుకున్న ఇమ్మాన్యుయెల్ ఊహించని విధంగా నాల్గవ పొజిషన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇమ్మాన్యుయెల్ నామినేషన్స్ లోకి రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. మొత్తం 13 వారాలు నామినేషన్స్ జరగ్గా అందులో కేవలం 3 సార్లు మాత్రమే ఇమ్మాన్యుయెల్ నామినేషన్స్ లోకి వచ్చాడు. నామినేషన్స్ లో ఉంటే ఆడియన్స్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ వచ్చేది. ఈ సీజన్ ఎక్కువ శాతం నామినేట్ అయ్యింది తనూజ అందుకే ఆమెకు ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది.
