Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. పవర్ అస్త్ర ఎవరి చేతికి వచ్చిందంటే..?

బిగ్ బాస్ సీజన్ 9లో ట్విస్ట్ లకు మాత్రం ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంటున్నారు బిగ్ బాస్ టీం.

By:  Ramesh Boddu   |   11 Oct 2025 9:55 PM IST
బిగ్ బాస్ 9.. పవర్ అస్త్ర ఎవరి చేతికి వచ్చిందంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో ట్విస్ట్ లకు మాత్రం ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంటున్నారు బిగ్ బాస్ టీం. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో కూడా ఆల్రెడీ డబల్ ఎలిమినేషన్ అనేది తెలిసిపోయింది. ఐతే ముందుగా శనివారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారా లేదా ఆదివారం ఇద్దరిని ఒకె ఎపిసోడ్ లో బయటకు పంపిస్తారా అన్నది చూడాలి. ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ పక్కా అని తెలుస్తుంది. ఐతే వారిలో ఒకరు ఫ్లోరా షైనీ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ లీక్స్ ను బట్టి ఫ్లోరా ఆల్రెడీ ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది.

శనివారం ఎపిసోడ్ లో పవర్ అస్త్ర టాస్క్..

ఇక నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా హౌస్ లోకి వస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఆ లిస్ట్ ఇప్పటికే అప్డేట్ చేశాం. ఇక శనివారం ఎపిసోడ్ లో పవర్ అస్త్ర టాస్క్ ఒకటి నాగార్జున కండక్ట్ చేస్తారని తెలుస్తుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు డేంజర్ జోన్ నుంచి హౌస్ లోకి వెళ్లిన లీడర్ బోడ్ మెంబర్స్ కి ఈ టాస్క్ ఉంటుందట.

రాము, ఇమ్మాన్యుయెల్ కూడా ఈ టాస్క్ లో ఉంటారు. ఒక్కొక్కరు తమకు వచ్చిన ఛాన్స్ తో ఒకరిని ఈ పవర్ అస్త్ర రేసు నుంచి తప్పించి ఫైనల్ గా ఇమ్మాన్యుయెల్ కి ఈ పవర్ అస్త్ర దక్కేలా చేస్తారట. రాము, ఇమ్మాన్యుయెల్, దివ్య, తనూజ, భరణి, కళ్యాణ్ ల మధ్య ఈ పవర్ అస్త్ర టాస్క్ జరుగుతుంది. ఫైనల్ గా ఇమ్మన్యుయెల్ ఈ పవర్ అస్త్ర సంపాదిస్తాడు. ఐతే ఈ పవర్ అస్త్ర తో ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ని సేఫ్ చేసే అవకాశం కూడా బిగ్ బాస్ ఇస్తాడట.

డబల్ ఎలిమినేషన్ లో ట్విస్ట్ కూడా..

సో ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో ట్విస్ట్ కూడా అదే ఉండబోతుందట. ఒకవేళ పవర్ అస్త్ర ఇమ్మాన్యుయెల్ ఇవ్వకపోతే మాత్రం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పటికే రేసులో దూసుకెళ్తున్న ఇమ్మాన్యుయెల్ కి పవర్ అస్త్ర కూడా దొరికింది. కచ్చితంగా ఇమ్మాన్యుయెల్ ఈ సీజన్ గేం ఛేంజర్ గా మారుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు.

బిగ్ బాస్ సీజన్ 9లో ఐదు వారాల ఆటలో ఇమ్మాన్యుయెల్ ఇప్పటికే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక వీకెండ్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి వారితో కూడా ఇమ్మాన్యుయెల్ ఆట ఇలానే ఉంటే అతను టాప్ 5 పక్కా అనేలా ఉంటుంది.