Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. టికెట్ టూ ఫినాలే రేసు.. ఆమె ఎలిమినేట్..!

బిగ్ బాస్ సీజన్ 9లో కేవలం 3 వారాలు మాత్రమే ఉండగా ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ మొదలు పెట్టాడు బిగ్ బాస్.

By:  Ramesh Boddu   |   3 Dec 2025 11:03 AM IST
బిగ్ బాస్ 9.. టికెట్ టూ ఫినాలే రేసు.. ఆమె ఎలిమినేట్..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో కేవలం 3 వారాలు మాత్రమే ఉండగా ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలే గెలిచిన వారు మొదటి టాప్ కంటెస్టెంట్ అంటే చివరి వారం వరకు వారు హౌస్ లో ఉంటారు. ఐతే నామినేషన్స్ లో డీమాన్ పవన్ ఈసారి టికెట్ టు ఫినాలే నేనే కొడతా అని హౌస్ మేట్స్ కి ఛాలెంజ్ చేశాడు.

టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా యాక్టివిటీ ఏరియాలో ఫజిల్స్ ఇచ్చిన బిగ్ బాస్ ఆ ఫజిల్స్ లో వాళ్లకి సంబంధించిన కలర్ మీద నిలబడాలి. ఇక ప్రతి టాస్క్ ఆడి గెలవడంతో పాటు పోటీగా ఒకరిని ఎంచుకుని వారి మీద గెలిచి ఫజిల్ లో వారి స్థానాన్ని ఆక్యుపై చేసుకోవాలి.

టికెట్ టు ఫినాలే ఫస్ట్ టాస్క్ లో..

బిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ టు ఫినాలె ఫస్ట్ టాస్క్ లో ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, రీతు ఆడారు. వారిలో ఇమ్మాన్యుయెల్ ఆ టాస్క్ గెలిచి నెక్స్ట్ తనకు ప్రత్యర్ధిగా సంజనాని ఎంచుకున్నాడు. ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, రీతు లకు మ్యాథ్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఇమ్మాన్యుయెల్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఇక సంజనతో ఒక చేత్తో బాల్ ని బాస్కెట్ లో వేయాలి.. మరో హ్యాండ్ తో తాడుని పట్టుకోవాలి. ఈ టాస్క్ లో సంజన మంచి ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఒకసారి తాడుని వదలడంతో టాస్క్ ఓడిపోయింది. ఫైనల్ గా సంజన టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి తొలగించబడింది.

ఫజిల్ లో సంజన స్పేస్ ని కూడా తన కలర్ ప్లాంక్స్ తో ఇమ్మాన్యుయెల్ ఆక్యుపై చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ రౌండ్ లో మరో ముగ్గురు టాస్క్ ఆడాలని బిగ్ బాస్ చెప్పాడు. ఆ టైం లో తనూజ, భరణి, డీమాన్ పవన్ టాస్క్ ఆడతారు. ఇచ్చిన కలర్ ఫ్లవర్స్ ని వారికిచ్చిన బాక్స్ లో గుచ్చాలి. ఈ టాస్క్ లో డీమాన్ పవన్ ఫైట్ చేశాడు. ఐతే తనూజ, భరణి అతన్ని అడ్డుకున్నారు. ఫైనల్ గా ఈ టాస్క్ లో తనూజ గెలిచింది.

ఇమ్మాన్యుయెల్ గెలిచి..

గెలిచిన తనూజ నెక్స్ట్ సుమన్ తో ఛాలెంజ్ చేసింది. ఆ టాస్క్ ఏంటన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. సో ఈ సీజన్ టికెట్ టు ఫినాలే టాస్క్ లో సంజన అవుట్ ఆఫ్ ది రేస్ కాగా.. ఇమ్మాన్యుయెల్ ఒక టాస్క్ గెలిచి ముందున్నాడు. టికెట్ టు ఫినాలె గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలని కంటెస్టెంట్స్ అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ టాస్క్ గెలిస్తే ఓటింగ్ తో సంబంధం లేకుండా ఫైనల్ వీక్ దాకా కంటెస్టెంట్స్ వెళ్లొచ్చు అందుకే అందరు ఈ టాస్క్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.