ఇమ్మాన్యుయెల్ సెల్ఫిష్ అంటున్నారు.. అక్కడ రియాక్షన్ మాత్రం..!
ఐతే ఇమ్మాన్యుయెల్ కూడా ఆడియన్స్ ఓటింగ్ లో టాప్ 2లో ఉన్నందుకు అతనికి తన గర్ల్ ఫ్రెండ్ నుంచి వాయిస్ కాల్ వచ్చిందని అది వినాలంటే మాత్రం గౌరవ్ తన స్పెషల్ పవర్ బిగ్ బాస్ బ్లెస్సింగ్ పవర్ ని తీసేయాలని చెబుతారు.
By: Ramesh Boddu | 9 Nov 2025 10:26 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆటలో దూసుకెళ్తున్నాడు ఇమ్మాన్యుయెల్. అతని ఆట తీరుతో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఐతే పైకి కనిపించట్లేదు కానీ ఇమ్మాన్యుయెల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.. చాలాసార్లు తన సెల్ఫిష్ నెస్ బయటపడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. శనివారం ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయెల్ కి ఆడియన్స్ హిట్ అని 95 శాతం మంది ఇస్తే ఒక 5 పర్సెంట్ మాత్రం ఫ్లాప్ అని ఇచ్చారు.
గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ కోసం గౌరవ్ పవర్..
ఐతే ఇమ్మాన్యుయెల్ కూడా ఆడియన్స్ ఓటింగ్ లో టాప్ 2లో ఉన్నందుకు అతనికి తన గర్ల్ ఫ్రెండ్ నుంచి వాయిస్ కాల్ వచ్చిందని అది వినాలంటే మాత్రం గౌరవ్ తన స్పెషల్ పవర్ బిగ్ బాస్ బ్లెస్సింగ్ పవర్ ని తీసేయాలని చెబుతారు. ఐతే ఇమ్మాన్యుయెల్ గౌరవ్ కి తనకు ఇచ్చిన పవర్ ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు. అతనికి అది ఉన్నా ఉపయోగం లేదు అన్నట్టుగా తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వినేశాడు ఇమ్మాన్యుయెల్.
అందరి విష్ లు తీరాక నాగార్జున ఇమ్మాన్యుయెల్ తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ కోసం గౌరవ్ పవర్ ని డిలీట్ చేశాడని చెప్పగా గౌరవ్ చాలా అప్సెట్ అయ్యాడు. తన పవర్ ని నీ వాయిస్ మెసేజ్ కోసం తీస్తావా అని అడిగాడు. ఇమ్మాన్యుయెల్ తన స్వార్ధం కోసం అవతల వ్యక్తి పవర్ ని మిస్ యూజ్ చేశాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు ఆల్రెడీ కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయెల్ మళ్లీ కెప్టెన్ కోసం ఎత్తులు వేయడం ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
హౌస్ లో ఒకరి కోసం సాక్రిఫైజ్,,
అఫ్కోర్స్ హౌస్ లో ఒకరి కోసం సాక్రిఫైజ్ చేయడం అతనికే ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. కానీ గెలవడం కన్నా కొన్నిసార్లు ఓడిపోతే ఆడియన్స్ దృష్టిలో గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలాంటి విషయాల్లో ఇమ్మాన్యుయెల్ వెనకపడుతున్నాడు. శనివారం ఎపిసోడ్ లో అతని గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ కోసం గౌరవ్ పవర్ ని తీసేయడం అన్నది మెజారిటీ ఆడియన్స్ కి నచ్చలేదు. ఐతే ఇమ్మాన్యుయెల్ కూడా ఎమోషనల్ గా లో అయ్యాడు. ఈ టైం లో ఆ వాయిస్ మెసేజ్ అతనికి పుష్ ఇస్తుందని అతనికి సపోర్ట్ చేసే వాళ్లు ఉన్నారు.
ఏది ఏమైనా హౌస్ లో మాత్రం ఎవరి ఆట వారు ఆడుతున్నారు. ఈ సీజన్ విన్నర్ రేసులో ఇమ్మాన్యుయెల్ ఉండాలంటే అన్నీ తనకే కావాలి అన్నట్టు కాకుండా కొన్ని సాక్రిఫైజ్ లు చేసి ఆడియన్స్ మనసులు గెలవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇమ్మాన్యుయెల్ మళ్లీ ఇదే మిస్టేక్ మళ్లీ రిపీట్ చేస్తాడా లేదా ఆటని అర్థం చేసుకుని కాస్త పట్టు విడుస్తాడా అన్నది చూడాలి.
