ఫైనల్ వీక్.. ఇమ్మాన్యుయెల్ ఇంకా భయపడుతున్నాడెందుకు..?
బిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ వీక్ దగ్గరకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 7 ఉన్నారు. వారిలో ఇద్దరిని ఈ వీకెండ్ ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది.
By: Ramesh Boddu | 11 Dec 2025 12:40 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ వీక్ దగ్గరకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 7 ఉన్నారు. వారిలో ఇద్దరిని ఈ వీకెండ్ ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది. ఐతే ఈ వారం లీడర్ బోర్డ్ టాస్క్ లో మంగళవారం టాప్ లో ఉన్నాడు ఇమ్మాన్యుయెల్. నెక్స్ట్ ప్లేస్ లో డీమాన్ పవన్ ఉన్నాడు. ఐతే ఇమ్మాన్యుయెల్ టాప్ లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ హౌస్ మేట్స్ నెక్స్ట్ టాస్క్ ఒకరిని తీసేయాలని బిగ్ బాస్ చెప్పగా ఆ విషయంలో తనను తీసేయొద్దని ఇమ్మాన్యుయెల్ వాధిస్తూ వచ్చాడు.
తన స్త్రెంగ్త్ తెలిసినా కూడా ఇమ్మాన్యుయెల్..
లీస్ట్ లో ఉండి తనకు ఇమ్యునిటీ రాకపోతే ఒకవేళ నేను ఈ వారం ఎలిమినేట్ అయితే అప్పుడు మీరంతా హ్యాపీనా అంటూ ఫైర్ అవుతున్నాడు. ఐతే అసలు ఇమ్మాన్యుయెల్ ఈ సీజన్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పగా అతను ఇలా చివరి వారం ఎలిమినేషన్ కి భయపడటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఇమ్మాన్యుయెల్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడని అతని ఫాలోవర్స్ అనుకుంటున్నారు.
అతను నామినేషన్స్ టైంలో కూడా చాలా కంగారు పడేవాడు. తన స్త్రెంగ్త్ తనకు తెలిసినా కూడా ఇమ్మాన్యుయెల్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని అనుకుంటున్నారు. నామినేషన్స్ లో ఎక్కువసార్లు వస్తేనే తనకంటూ ఒక సెపరేట్ ఓటింగ్ అనేది ఉంటుంది. కానీ ఇమ్మాన్యుయెల్ అలా నామినేషన్స్ లో రావడానికి కూడా ఇష్టపడలేదు. ఫైనల్ గా మరో వారం మాత్రమే ఉన్న ఈ లీడర్ బోర్డ్ టాస్క్ లో కూడా తాను లీస్ట్ లో ఉంటే పొరపాటున ఎలిమినేట్ అయితే అంటూ వాధిస్తున్నాడు.
సీజన్ విన్నర్ క్వాలిటీస్..
టాప్ 5కి తాను పక్కా వెళ్తున్నా అని ఇప్పటికీ ఇమ్మాన్యుయెల్ అనుకోకపోవడం ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది. హౌస్ లో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు టాస్క్ లల్లో అదరగొట్టిన ఇమ్మాన్యుయెల్ ఈ సీజన్ విన్నర్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయని ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఎలిమినేట్ అవుతానేమో అని ఈ టైం లో చెప్పడం కామెడీగా అనిపిస్తుంది. ఈ వారం ఇమ్యునిటీ పొంది ఫైనల్ వీక్ వెళ్లేందుకు మిగతా హౌస్ మేట్స్ అంతా ట్రై చేస్తున్నారు. కళ్యాణ్ ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5లో స్థానం దక్కించుకున్నాడు.
ఇమ్మాన్యుయెల్, తనూజ, డీమాన్ పవన్ కూడా కళ్యాణ్ తో పాటు టాప్ 5 ఫిక్స్ అయినట్టే. ఐతే మిగిలిన భరణి, సంజన, సుమన్ లలో ఒకరికి మాత్రమే ఆ ఛాన్స్ వస్తుంది. అది ఎవరన్నది ఈ వీకెండ్ తెలుస్తుంది. సీజన్ 9లో టాప్ 5 దాదాపు అందరు గెస్ చేసేస్తున్నారు. కానీ విన్నర్ ఎవరన్నది మాత్రం చెప్పడం కష్టంగానే ఉంది. ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, తనూజ ఈ ముగ్గురి మధ్యలోనే విజేత ఉన్నాడు. ఐతే కళ్యాణ్ కామనర్ కాబట్టి అతనికి ఆడియన్స్ లో ఎక్కువ క్రేజ్ ఉంది. అంటే కామనర్ గా వచ్చి టాప్ 5 ఛాన్స్ పొందాడని అతన్ని ఇష్టపడుతున్నారు. ఇమ్మాన్యుయెల్ తనూజ కూడా టఫ్ ఫైట్ తో కొనసాగుతున్నారు.
