బిగ్ బాస్ 9.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..?
బిగ్ బాస్ సీజన్ 9లో 13వ వారం హౌస్ నుంచి కెప్టెన్ కళ్యాణ్ నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వగా.. ఇమ్మాన్యుయెల్ ని ఎవరు నామినేట్ చేయకపోవడంతో అతను సేఫ్ అయ్యాడు.
By: Ramesh Boddu | 3 Dec 2025 1:44 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో 13వ వారం హౌస్ నుంచి కెప్టెన్ కళ్యాణ్ నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వగా.. ఇమ్మాన్యుయెల్ ని ఎవరు నామినేట్ చేయకపోవడంతో అతను సేఫ్ అయ్యాడు. ఐతే 3 వారాలు ఆట మాత్రమే ఉన్న ఈ టైం లో ఇమ్మాన్యుయెల్ నామినేషన్స్ కి రాకుండా ఉండటం ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఐతే వారిద్దరు కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ అంతా కూడా నామినేషన్స్ లో ఉన్నారు.
లీస్ట్ టూ గా ఉన్న ఇద్దరిలో..
ఈ వారం నామినేషన్స్ లో భరణి, తనూజ, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, రీతు, సంజన ఉన్నారు. ఐతే వీరిలో ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే రిస్క్ అని తెలుస్తుంది. ముఖ్యంగా లీస్ట్ టూ గా ఉన్న ఇద్దరిలో ఒకరు లేదా ఇద్దరు అయినా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్ అఫీషియల్ ఓటింగ్స్ చూస్తే ఈ వారం సుమన్ శెట్టి దాదాపు ఎలిమినేషన్ పక్కా అనేలా ఉన్నాయి. కొంతమంది సంజనాకి కూడా లీస్ట్ ఓటింగ్ ఉందని అంటున్నారు.
ఏది ఏమైనా ఈ వారం సంజన, సుమన్ శెట్టి ఈ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. అసలైతే భరణి కూడా ఈ లిస్ట్ లో ఉండాలి కానీ గత రెండు వారాలుగా భరణి యాక్టివ్ గా ఉంటున్నాడు. తను ఎంజాయ్ చేస్తూ హౌస్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. అందుకే ఈ వారం భరణి దాదాపు సేఫ్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
సంజన హౌస్ లో ఫుల్ ఫైట్స్..
ఐతే హౌస్ లో సుమన్ శెట్టి లోన్లీగా ఉంటున్నాడు. అతనిలో ఎందుకో అంత ఎనర్జీ కనిపించట్లేదు. 13 వారాలు దాకా ఉన్నాం చాలు అన్నట్టుగా సుమన్ శెట్టి ఫీలవుతున్నాడని అనిపిస్తుంది. మరోపక్క సంజన హౌస్ లో గత వారం వరకు ఫుల్ ఫైట్స్ చేసింది. రీతు, డీమాన్ ఇష్యూ వల్ల సంజన మీద కాస్త నెగిటివిటీ వచ్చింది. ఐనా సరే ఆడియన్స్ ఆమెను సేఫ్ చేస్తూ వచ్చారు. ఈ వారం ఆమె సేఫ్ అయితే ఆట మరింత టఫ్ గా ఆడే ఛాన్స్ ఉంటుంది. ఐతే సుమన్ లేదా సంజన ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని అంచనా వేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. రాబోయే రెండు వారాల్లో ఎలిమినేషన్స్ జరిగితే టాప్ 5 లేదా 6 ఎవరన్నది ఫైనల్ అవుతుంది. ఐతే ప్రస్తుతం హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది. మొదటి రౌండ్ లోనే సంజనా ఆట నుంచి ఎలిమినేట్ అయ్యింది. సో ఈ వారం ఆమెకు ఇదొక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.
