Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్.. ఎందుకు వచ్చారంటే..?

బిగ్ బాస్ హౌస్ లోకి మరోసారి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. మండే నామినేషన్స్ సందర్భంగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చేస్తారని తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   27 Oct 2025 12:11 PM IST
బిగ్ బాస్ హౌస్ లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్.. ఎందుకు వచ్చారంటే..?
X

బిగ్ బాస్ హౌస్ లోకి మరోసారి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. మండే నామినేషన్స్ సందర్భంగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చేస్తారని తెలుస్తుంది. ఐతే రెండు కత్తులతో వాళ్లు హౌస్ లోకి వస్తే ఒకటి తాము ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారికి ఇచ్చిన సర్కిల్ షీట్ కి పొడుస్తారు.. మరొకటి ఎవరికైనా ఇచ్చి వారిని వాళ్లకు నామినేట్ చేయాలని అనిపించిన వారికిచ్చిన సర్కిల్ షీట్ పై పొడిచి నామినేట్ చేయమని చెబుతారు.

బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ షాక్..

అలా మరోసారి హౌస్ మేట్స్ ని ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి షాక్ ఇస్తారు. ఐతే వీరిలో ఒకరిద్దరు హౌస్ లో కొనసాగుతారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు ఎపిసోడ్ మొదటి ప్రోమో వచ్చేసింది. అందులో మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా ఎంట్రీ ఇచ్చినట్టు చూపించారు. శ్రీజ కళ్యాణ్ ని నామినేట్ చేసింది. కళ్యాణ్ రాము ని నామినేట్ చేస్తాడు. ప్రియ సంజనాను రోడ్ రోలర్ అనడం గురించి చెబుతుంది. మనీష్ దివ్యాకి క్లాస్ ఇస్తున్నాడు.

మధ్యలో ఇమ్మాన్యుయెల్ తనూజని నామినేట్ చేసి బొమ్మా టాస్క్ పై చర్చిస్తున్నాడు. ఇమ్మాన్యుయెల్ వర్సెస్ తనూజ మరోసారి హౌస్ లో వాదన జరిగినట్టు తెలుస్తుంది. నామినేషన్స్ లో దాదాపు అందరు పాత కంటెస్టెంట్స్ ఉన్నారని తెలుస్తుంది. ఐతే వైల్డ్ కార్డ్స్ నుంచి ఒక్క మాధురి మాత్రమే ఈ వారం నామినేషన్స్ లో ఉండేలా ఉన్నారు.

శ్రీజతో పాటు మరో కంటెస్టెంట్ కూడా..

బిగ్ బాస్ సీజన్ 9లో ఆల్రెడీ హౌస్ నుంచి బయటకు వెళ్లిన కంటెస్టెంట్స్ ని మళ్లీ హౌస్ లోకి తీసుకు రావడం జరుగుతుంది. శ్రీజ దమ్ము అయితే దాదాపు హౌస్ లోకి రావడం కన్ఫర్మ్ అంటున్నారు. శ్రీజతో పాటు మరో కంటెస్టెంట్ కూడా హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. ఈ సీజన్ ని ఎలాగైనా హిట్ చేయాలన్న ఉద్దేశ్యంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పెద్దగా ఆట పరంగా ఎంటర్టైన్ చేయలేకపోతున్నారని హౌస్ లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ని తీసుకొస్తున్నారు. ఐతే శ్రీజతో పాటు భరణి హౌస్ లోకి వస్తే బాగుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. అతనికి మరో ఛాన్స్ ఇస్తే బెటర్ అని ఆడియన్స్ కోరుతున్నారు.

బిగ్ బాస్ ఏ సీజన్ లో కూడా ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లిన కంటెస్టెంట్స్ మళ్లీ హౌస్ లోకి రావడం జరగలేదు. అది కూడా ఆట ఆడటానికి రాలేదు. మరి హౌస్ లోకి వచ్చిన ఈ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఏం చేస్తారన్నది చూడాలి.