Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. డబల్ ఎలిమినేషన్ లో అతను అవుట్ మరొకరు ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. వారిలో ఈ వారం ఒకరు లేదా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా అన్న కన్ ఫ్యూజన్ ఉంది.

By:  Ramesh Boddu   |   13 Dec 2025 6:19 PM IST
బిగ్ బాస్ 9.. డబల్ ఎలిమినేషన్ లో అతను అవుట్ మరొకరు ఎవరంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. వారిలో ఈ వారం ఒకరు లేదా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం డబల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ టీం. శనివారం ఎపిసోడ్ లో ఒకరు ఆదివారం ఎపిసోడ్ లో మరొక ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఐతే టాప్ లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న తనూజ అత్యధిక ఓటింగ్ పర్సెంటేజ్ తో కొనసాగుతుంది. నామినేషన్స్ లో కళ్యాణ్ కూడా లేకపోవడంతో దాదాపు 30 శాతం ఓటింగ్ పర్సెంటేజ్ తో తనూజ మాస్ స్టామినా చూపిస్తుంది.

ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా..

ఇక ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. అతని తర్వాత డబల్ ఎలిమినేషన్ లో భాగంగా మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం రెండో ఎలిమినేట్ గా భరణి బయటకు వచ్చేస్తారని తెలుస్తుంది. హౌస్ నుంచి ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లొచ్చిన భరణి రీ ఎంట్రీ తర్వాత మొదట్లో కాస్త కన్ ఫ్యూజ్ అయినా ఫైనల్ గా తన ఆటతో మెప్పించాడు.

ఈ వారం లీడర్ బోర్డ్ టాస్క్ లో కూడా డీమాన్ పవన్, సుమన్ ల కన్నా ముందు ఉన్నాడు. ఐతే 3వ హౌస్ మేట్ గా ఇమ్యూనిటీ టాస్క్ లో అవుట్ ఆఫ్ టాస్క్ అయ్యాడు. ఐతే ఈ వారం భరణి ఎలిమినేట్ అవుతున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ శనివారం ఎపిసోడ్ షూట్ లీక్స్ ప్రకారం సుమ శెట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ పూర్తైందట. ఐతే రెండో ఎలిమినేషన్ అప్డేట్ లీక్ ఇంకా బయటకు రాలేదు.

భరణి, సంజనా మధ్యలోనే ఐదో స్థానం..

దాదాపు భరణినే కన్ఫర్మ్ ఎలిమినేషన్ అనేస్తున్నారు. సో భరణి, సుమన్ బయటకు వస్తే సంజనా టాప్ 5లో ఛాన్స్ దక్కించుకుంటుంది. ఆల్రెడీ టికెట్ టు ఫినాలే గెలిచి కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్ కాగా రెండు, మూడు స్థానాల్లో తనూజ, ఇమ్మాన్యుయెల్ ఉన్నారు. ఇక ఫోర్త్ ప్లేస్ లో డీమాన్ పవన్ ఆ తర్వాత టాప్ 5 గా సంజన ఉన్నారు. భరణి, సంజనా మధ్యలోనే ఐదో స్థానం ఉంటుందని అందరు అనుకోగా అనూహ్యంగా ఆడియన్స్ సంజనాకి ఓటు వేసి భరణిని ఎలిమినేట్ చేశారు. భరణి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడన్న కారణంతో ఆడియన్స్ సంజనాకి టాప్ 5 ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఐతే సంజనా కూడా టాప్ 5 ఉండేందుకు చాలా కష్టపడింది.

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీకెండ్ ఎపిసోడ్ ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చేయనుంది. ఆల్రెడీ శనివారం ఫస్ట్ ప్రోమో వచ్చింది. అందులో భరణి, సుమన్ ల ఫ్రెండ్ షిప్ వీడియోని చూపించి ఇన్ డైరెక్ట్ గా ఈ ఇద్దరు ఎలిమినేట్ అవుతారని చూపించారని చెప్పొచ్చు.