బిగ్ బాస్ 9.. డీమాన్ కి అన్యాయం చేసిన హౌస్ మేట్స్..!
ఈ క్రమంలో ఈ వారం జరుగుతున్న సీక్రెట్ కెప్టెన్సీ టాస్క్ నుంచి బుధవారం ఎపిసోడ్ లో డీమాన్ పవన్ ని కంటెండర్ రేసు నుంచి తప్పించారు.
By: Ramesh Boddu | 6 Nov 2025 9:44 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో డీమాన్ పవన్ కి కాస్త అన్ లక్కీ వెంటాడుతుందని అర్ధమవుతుంది. ఫిజికల్ టాస్క్ లల్లో అతను అదరగొట్టేస్తాడు. అందుకే అతను ఏ టాస్క్ ఆడినా సరే దాదాపు గెలుపు తనదే అవుతుంది. ఐతే ఇప్పుడు హౌస్ మెట్స్ అంతా కలిసి డీమాన్ పవన్ ని ముందు టాస్క్ ల నుంచి తప్పిస్తే గొడవ వదిలిపోతుంది అనే మాస్టర్ ప్లాన్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ వారం జరుగుతున్న సీక్రెట్ కెప్టెన్సీ టాస్క్ నుంచి బుధవారం ఎపిసోడ్ లో డీమాన్ పవన్ ని కంటెండర్ రేసు నుంచి తప్పించారు.
కళ్యాణ్, నిఖిల్ కంటెండర్ రేసు నుంచి ఎలిమినేట్..
ఆల్రెడీ హౌస్ లో రెబల్స్ ఉన్నారని బిగ్ బాస్ చెబుతుండగా వారికిచ్చిన టాస్క్ పూర్తి చేసి వాళ్లకు ఆటలో అడ్డు పడే వారిని ఆట నుంచి తప్పించాలి అలా ముందు కళ్యాణ్ ని కంటెండర్ రేసు నుంచి తప్పించారు. నెక్స్ట్ నిఖిల్ ని రేసు నుంచి తప్పించారు. ఐతే హౌస్ లో రెబల్ ఎవరు అనుకుంటున్నారు అన్నది బిగ్ బాస్ హౌస్ మెట్స్ ని అడిగి ఎక్కువ ఎవరికైతే ఓట్స్ పడతాయో వారిని కూడా ఈ వారం కెప్టెన్సీ రేసు నుంచి తప్పిస్తారని అనౌన్స్ చేశాడు.
ఐతే ఇదే మంచి ఛాన్స్ అని ఆరుగురు డీమాన్ పవన్ పేరు చెప్పారు. ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఎక్కువ ఓటింగ్ వచ్చిన వారు ఆట నుంచి తొలగిపోతారని చెప్పాడు కాబట్టి రెబల్ గా డీమాన్ అని వాళ్లు చెప్పి అయితే రెబల్ అవుతాడు లేదంటే ఆట నుంచి తొలిగిపోతాడు. రెండిటి వల్ల తమకే బెనిఫిట్ అని అనుకున్నారు. ఐతే ఆరుగురు డీమాన్ పవన్ రెబల్ అని చెప్పగా.. ఐదుగురు శ్రీనివాస్ సాయి రెబల్ అని చెప్పారు. నిఖిల్ ఒక్కడే భరణి రెబల్ అని చెప్పారు.
ప్లానింగ్ ప్రకారంగానే డీమాన్ పవన్ పై టార్గెట్..
కానీ ఆటలో అసలు రెబల్స్ దివ్య, సుమన్ వాళ్లిద్దరి పేరు ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. సో డీమాన్ పవన్ కి ఎక్కువ ఓట్స్ రావడంతో అతను ఈ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. డీమాన్ పవన్ కి ఇది ఒక రకంగా అన్యాయమనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ రెబల్ అవ్వొచ్చు ఎక్కువ ఓట్స్ పడిన వారు రేసు నుంచి తప్పుకుంటారని చెప్పడంతో ఒక ప్లానింగ్ ప్రకారంగానే డీమాన్ పవన్ ని తప్పించారని అనిపిస్తుంది.
ఈ విషయంపై రీతు డీమాన్ కి సపోర్ట్ గా తనూజ తో వాధించింది. ఐతే తనూజ ఇది గ్రూప్ డెసిషన్ అంతేకాదు తను సాయిని రెబల్ గా ఓట్ చేశా పవన్ ని తొలగించాలని ఉంటే అతని పేరే చెప్పేదాన్ని కదా అని అన్నది. ఫైనల్ గా రెబల్ కాని డీమాన్ పవన్ ఓటింగ్ ఎక్కువ పడటం వల్ల ఈ వారం కెప్టెన్సీ రేసు నుంచి బయటకు వచ్చేశాడు. తప్పకుండా డీమాన్ పవన్ కి కొంత మైనస్ అయినా అతని కేపబిలిటీ తెలుసు కాబట్టే అందరు ఇలా కలిసి అతన్ని తీసేశారని స్పష్టంగా అర్ధమవుతుంది.
