డిమాన్ పవన్ లో ఇంత టాలెంట్ ఉందా.. హౌస్ లో ఎందుకా పులిహోర పనులు..?
బిగ్ బాస్ సీజన్ 9లో డిమాన్ పవన్ ఎప్పుడు చూసినా రీతుతో ఉంటున్నాడు. ఆమె, అతను కలిసి ఒక లవ్ ట్రయల్ లో ఉన్నారు.
By: Ramesh Boddu | 18 Oct 2025 9:28 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో డిమాన్ పవన్ ఎప్పుడు చూసినా రీతుతో ఉంటున్నాడు. ఆమె, అతను కలిసి ఒక లవ్ ట్రయల్ లో ఉన్నారు. ఇద్దరు ఒకరికోసం ఒకరు ఆట ఆడుతున్నారు. రీతుని ఎవరేం అన్నా కూడా డీమాన్ పవన్ వస్తున్నాడు. పవన్ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ అందుకే రీతు అతని దగ్గరకు వెళ్తుందని.. అతన్ని తన ఆట ఆడకుండా రీతు ఒక అడ్డుగా మారింది. డీమాన్ పవన్ బిగ్ బాస్ సీజన్ 9లోకి ఒక కామనర్ గా వచ్చాడు. ఐతే అతను ఒక స్పోర్ట్స్ పర్సన్.. ఫిజికల్ గా చాలా ఫిట్ అయిన అతను అగ్నిపరీక్ష షోలో జడ్జిలను ఇంప్రెస్ చేశాడు.
స్పోర్ట్స్ పర్సన్ అయిన డీమాన్ పవన్..
ఐతే డీమాన్ పవన్ హౌస్ లో మాత్రం ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం డీమాన్ పవన్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతను గెలిచిన షీల్డ్స్ అన్ని బయటకు వచ్చాయి. మంచి స్పోర్ట్స్ పర్సన్ అయిన డీమాన్ పవన్ తనకు మంచి కాలిబర్ ఉందని తెలిసినా కూడా రీతు తో పులిహోర కార్యక్రమాలు చేస్తూ అవుట్ ఫోకస్ అవుతున్నాడు.
డీమాన్ పవన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తెలుస్తున్నా అతను మాత్రం ఆటలో తన పనితనాన్ని చూపించలేకపోతున్నాడు. ఐతే డీమాన్ పవన్ టాలెంట్ గురించి తెలిసిన వాళ్లంతా కూడా అతని ఆట తీరు మార్చుకోకపోతే మాత్రం డేంజర్ లో పడినట్టే అవుతుంది. రీతు చౌదరి తన ఆట కోసం డీమాన్ పవన్ ని వాడుకుంటుందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. పైకి ఇద్దరు ఫ్రెండ్ షిప్ అని కవర్ చేస్తున్నా రీతు మాత్రం పవన్ ఆటని చెడగొడుతూ అతనికి అడ్డుగా మారిందని అనిపిస్తుంది.
డీమాన్ పవన్ అయేషా సాల్సా డాన్స్..
బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫైర్ స్టోరంస్ వచ్చాక రీతు మీద ఎటాకింగ్ ఎక్కువైంది. అయేషా రీతుకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా ఎటాక్ చేస్తుంది. డీమాన్ పవన్ తో అయేషా కావాలని క్లోజ్ అవుతుంది. అతనితో సాల్సా డాన్స్ కూడా వేసింది. ఐతే డీమాన్ తనకు మాత్రమే సొంతమన్నట్టు రీతు ఫీల్ అవుతుంది. డీమాన్ పవన్ తన ఆట తీరు మార్చుకోకపోతే మాత్రం అతను కూడా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడని అనిపిస్తుంది.
సీజన్ 9లో కామనర్స్ లో ఇప్పుడు కేవలం డీమాన్ పవన్, కళ్యాణ్ హౌస్ లో ఉన్నారు. ఐతే మరో కామనర్ దివ్య రెండు వారాల తర్వాత హౌస్ లోకి వచ్చింది. సో ప్రస్తుతం హౌస్ లో ముగ్గురు కామనర్స్ ఉన్నారు. వీరి ఆట తీరుని బట్టి నెక్స్ట్ రాబోయే వారాల్లో వీరి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది.
