Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. ఫైనల్ 15 ఎవరంటే..?

బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్ సెలక్షన్స్ కోసం ఎన్నో లక్షల మంది అప్లికేషన్స్ నుంచి 45 మెంబర్స్ ని ఫైనల్ చేశారు.

By:  Ramesh Boddu   |   26 Aug 2025 10:21 AM IST
బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. ఫైనల్ 15 ఎవరంటే..?
X

బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్ సెలక్షన్స్ కోసం ఎన్నో లక్షల మంది అప్లికేషన్స్ నుంచి 45 మెంబర్స్ ని ఫైనల్ చేశారు. వారిలోంచి 15మంది కోసం అగ్నిపరీక్ష కండక్ట్ చేశారు. ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి చేస్తుండగా జ్యూరీ మెంబర్స్ గా నవదీప్, బిందు మాధవి, అభిజిత్ చేశారు. ఐతే 3 రోజుల్లోనే ఈ టాప్ 15 మెంబర్స్ ని ఫైనల్ చేశారు జ్యూరీ మెంబర్స్. ఆల్రెడీ వారిని మెప్పించి ముగ్గురు చేత గ్రీన్ సిగ్నల్స్ తెచ్చుకున్న ఆరుగురు టాప్ 15 లో మొదట స్థానం సంపాదించుకున్నారు. వారిలో ప్రవీణ్, దివ్యా, అనూష, శ్రీయ, పవన్, శ్వేత ఉన్నారు.

టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ని బట్టి..

ఇక మిగిలిన 16 మందికి జ్యూరీ మెంబర్స్ 1 గ్రీన్, రెండు రెడ్.. లేదా రెండు గ్రీన్ ఒక రెడ్ తెచ్చుకున్న వారు ఉన్నారు. ఈ క్రమంలో ఈ 16 మందికి డేర్ ఆర్ డై అంటూ 3 లెవెల్స్ లో టాస్కులు కండక్ట్ చేశారు. ఈ టాస్కుల్లో వారి వారి పర్ఫార్మెన్స్ ని బట్టి జ్యూరీ మెంబర్స్ మరో 9 మందిని ఫైనల్ చేశారు. అలా రెండో ఎపిసోడ్ లో అంటే లెవెల్ 2 లో హరీష్, శ్రీజ, ప్రియా, కల్కి, కళ్యాణ్ లను సెలెక్ట్ చేశారు. వీరు ఐదుగురిలో కలిపి టాప్ 15 లో 11 మంది స్థానం సంపాదించుకున్నారు.

ఇక మిగిలిన 11 మందిలో నుంచి నలుగురిని టాప్ 15 లోకి సెలెక్ట్ చేయాలి. ఇక నేడు జరిగిన లెవెల్ 3 డేర్ ఆర్ డై టాస్క్ లో అందరు తమ తమ పర్ఫార్మెన్స్ ఇచ్చాక. ఆ టాస్కులు అన్నీ పూర్తి చేసుకున్నాక నాగ, డాలియా, షాకీబ్, మనీష్ టాప్ 15 లో ఛాన్స్ పొందారు. అలా ఫైనల్ గా టాప్ 15 మెంబర్స్ గోల్డెన్ చెయిర్ ని దక్కించుకున్నారు. ఐతే అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఈ 15 మెంబర్స్ లో 9 మంది బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గింటారు.

సెలబ్రిటీస్ కి ఈక్వెల్ గా కామన్ మ్యాన్..

ఐతే జరిగిన బిగ్ బాస్ అగ్నిపరీక్షలో భాగంగా అందరు తమ తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈసారి సెలబ్రిటీస్ కి కూడా కామన్ మ్యాన్ గా వస్తున్న వీళ్లంతా కూడా టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వాళ్లకు ఆల్రెడీ ఓట్ బ్యాంక్ రెడీ అవుతుంది. తప్పకుండా ఈసారి సెలబ్రిటీస్ కి ఈక్వెల్ గా కామన్ మ్యాన్ గా వచ్చిన కంటెస్టెంట్స్ కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకునేలా ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న మొదలవుతుంది. ఈసారి సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ వీరి మధ్య తప్పకుండా సూపర్ ఫైట్ జరగబోతుందని చెప్పొచ్చు.