Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఈసారి టఫ్ ఫైట్ పక్కా..!

బిగ్ బాస్ సందడి మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వడానికి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ హౌస్ లోకి వెళ్లే అర్హత ఉన్న కామన్ మ్యాన్ ఎంపిక జరుగుతుంది.

By:  Ramesh Boddu   |   24 Aug 2025 1:00 PM IST
బిగ్ బాస్ 9.. ఈసారి టఫ్ ఫైట్ పక్కా..!
X

బిగ్ బాస్ సందడి మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వడానికి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ హౌస్ లోకి వెళ్లే అర్హత ఉన్న కామన్ మ్యాన్ ఎంపిక జరుగుతుంది. దాదాపు వచ్చిన లక్షల కొద్దీ అప్లికేషన్స్ లో బిగ్ బాస్ టీం చాలా కష్టపడి వడకట్టి 45 మందిని సెలెక్ట్ చేశారు. వారిలో 15 మందిని ఫైనల్ చేస్తారు. ఆ 15 మెంబర్స్ లో డిఫరెంట్ టాస్కులు పెట్టి ఫైనల్ 5 ని తీస్తారు. ఆ ఐదుగురు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

అగ్నిపరీక్షలో టాలెంట్ చూపించారు..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో 3 రోజులుగా నడుస్తుంది. మొత్తం 3 ఎపిసోడ్స్ లో అందరు జడ్జిలు ముందుకొచ్చి వారి టాలెంట్ చూపించారు. కామన్ మ్యాన్ అని చెప్పడమే కానీ రాబోతున్న ఈ ఐదుగురు కామన్ మ్యాన్ ఆల్రెడీ అగ్నిపరీక్షలో తమ టాలెంట్ చూపించడంతో ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. తప్పకుండా ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వాళ్లకి మంచి ఓటింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో మొదటి 3 ఎపిసోడ్స్ ముగిశాక మొత్తం 45 మందిలో 15 మెంబర్స్ ని ఎంపిక చేయాల్సి ఉంది. ఐతే అందులో ఆరుగురు ఆల్రెడీ 15 మెంబర్స్ లో స్థానం సంపాదించుకున్నారు. జడ్జిలు ఎవరైతే డిజర్వ్ అనిపించారో అలా సిక్స్ మెంబర్స్ ని 15 ప్లేస్ లో పంపించారు. ఆ ఆరుగురికి ముగ్గురు జడ్జిలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్..

ఐతే మిగతా వాళ్లలో కొందరికి రెండు గ్రీన్, ఒక రెడ్.. రెండు రెడ్ ఒక గ్రీన్ వచ్చిన వారున్నారు. వారిలో నుంచి మరో 9 మందిని సెలెక్ట్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్ష సెకండ్ గేర్ లోకి వెళ్లింది. హోల్డ్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి టాస్కులు పెట్టి వాళ్లలో నుంచి 9 మందిని సెలెక్ట్ చేస్తారు. మరి ఇంతకీ ఆ ఛాన్స్ ఎవరికి వస్తుది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది చూడాలి.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఇప్పుడు సెలెక్ట్ అయ్యే ఐదుగురు కామన్ మ్యాన్ కూడా ఈ అగ్నిపరీక్షలో గెలిచారు కాబట్టి వారికి ఫ్యాన్ బేస్ పెరిగే ఛాన్స్ ఉంది. సో హౌస్ లోకి వచ్చే సెలబ్రిటీస్ కి తప్పకుండా వీళ్లు కూడా టఫ్ ఫైట్ ఇస్తారని అనిపిస్తుంది. ఈ సీజన్ సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అన్నారు. కానీ చూస్తుంటే అగ్నిపరీక్ష అయ్యే సరికి వీళ్లు కూడా సెలబ్రిటీస్ అయ్యేలా ఉన్నారు. సో అలా అయితే సీజన్ రసవత్తరంగా ఉండబోతుందని చెప్పొచ్చు.