బిగ్ బాస్ 9.. తనూజ కోసం ఆడియన్స్..!
బిగ్ బాస్ సీజన్ 9లో బుధవారం భరణి, తనూజతో మాట్లాడేందుకు హౌస్ లోకి ఆడియన్స్ వచ్చారు. బిగ్ బాస్ ఈ వారం హౌస్ మేట్స్ కి టాస్క్ ఇచ్చి వారిలో లీడర్ బోర్డ్ లో ఉన్న ఇద్దరికి ఆడియన్స్ తో మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నాడు.
By: Ramesh Boddu | 11 Dec 2025 10:23 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో బుధవారం భరణి, తనూజతో మాట్లాడేందుకు హౌస్ లోకి ఆడియన్స్ వచ్చారు. బిగ్ బాస్ ఈ వారం హౌస్ మేట్స్ కి టాస్క్ ఇచ్చి వారిలో లీడర్ బోర్డ్ లో ఉన్న ఇద్దరికి ఆడియన్స్ తో మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఐతే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఇద్దరిలో ఒకరికి ఓటింగ్ అప్పీల్ ఛాన్స్ కూడా ఇస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9లో బుధవారం ఎపిసోడ్ లో భరణి, తనూజలకు ఆ ఛాన్స్ దక్కింది. ఐతే తనూజకి ఆడియన్స్ ఓటింగ్ రిక్వెస్ట్ చేసేందుకు కూడా సపోర్ట్ చేశారు.
తనూజ గెలిచి లేడీ విన్నర్ అవ్వాలని..
సక్సెస్ అంటే ఏంటని భరణి, తనూజలను అడిగాడు బిగ్ బాస్ దానికి ఇద్దరు ఒకే విధమైన ఆన్సర్ ఇచ్చారు. ఒక మార్గంలో ప్రయత్నించి సక్సెస్ అవ్వడం.. అతని మార్గంలోనే తాను నడవాలని అనుకుంటానని భరణి చెప్పగా.. సక్సెస్ కోసం పేషెన్స్ చాలా అవసరమని తనూజ చెప్పింది. ఇక భరణి, తనూజతో ఆడియన్స్ మాట్లాడారు.
భరణిలో అరగెన్స్, కామెడీ నచ్చిందని ఒకరు చెప్పారు. తనూజని మేడం సార్ మేడం అంతే అని ఆమె టైటిల్ గెలవాలని అన్నారు. మరొక మహిళా ఆడియన్ కూడా తనూజ గెలిచి లేడీ విన్నర్ అవ్వాలని చెప్పింది. అలానే తనూజ ఓటింగ్ రిక్వెస్ట్ చేసింది. తనూజకి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చూసి మిగతా హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు.
టైటిల్ రేసులో ఏ స్థానంలో..
బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5లో తనూజ కంపల్సరీ అని తెలుస్తుంది. ఐతే టైటిల్ రేసులో ఆమె ఏ స్థానంలో ఉంటుంది అన్నది నెక్స్ట్ వీక్ ఓటింగ్ ని బట్టి తెలుస్తుంది. ఇప్పటివరకైతే లీడర్ బోర్డ్ లో టాప్ 2గా ఉండి ఆడియన్స్ కి ఓటింగ్ రిక్వెస్ట్ కూడా చేసింది తనూజ.
ఐతే గత రెండు వారాల్లో తనూజలో కాస్త ఫైర్ తగ్గిందని అనిపిస్తుంది. టఫ్ ఫైట్ కారణంగా ఆమె కాస్త కాన్ఫిడెన్స్ లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది. అందుకే లీడర్ బోర్డ్ టాస్క్ లో కూడా సంజన తర్వాత ఫజిల్ పెట్టి త్రెడ్ ని పట్టుకునేందుకు వెళ్లింది. త్రెడ్ పట్టుకునే టాస్క్ లో సంజన ముందు అవుట్ అవ్వగా భరణి ఫస్ట్ ప్లేస్ లో నిలవగా తనూజ రెండో స్థానంలో నిలిచింది. అందుకే లీడర్ బోర్డ్ లో టాప్ 2 లో ఉన్న భరణి, తనూజలకు ఆడియన్స్ తో మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు.
తనూజ ఆడియన్స్ తో మాట్లాడిన తర్వాత ఆమె చాలా హ్యాపీగా కనిపించింది. లివింగ్ ఏరియాలో ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, డీమాన్ పవన్ సరదాగా తనూజని ఆట పట్టించారు. సో ఇప్పటివరకు జరిగిన లీడర్ బోర్డ్ టాస్క్ లో ఇమ్మాన్యుయెల్, తనూజ ఇద్దరు ఆడియన్స్ కి ఓటింగ్ రిక్వెస్ట్ చేశారు. కళ్యాణ్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
