Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. భరణికి అన్యాయం చేసిన ఇమ్మాన్యుయెల్..?

బిగ్ బాస్ సీజన్ 9లో 6వ వారం ఎలిమినేషన్ జరిగింది. ఈ సీజన్ లో వెరీ స్ట్రాంగ్ ఇంకా టాప్ 5 పక్కా అనుకున్న సీరియల్ యాక్టర్ భరణి ఎలిమినేట్ అయ్యాడు.

By:  Ramesh Boddu   |   20 Oct 2025 9:33 AM IST
బిగ్ బాస్ 9.. భరణికి అన్యాయం చేసిన ఇమ్మాన్యుయెల్..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో 6వ వారం ఎలిమినేషన్ జరిగింది. ఈ సీజన్ లో వెరీ స్ట్రాంగ్ ఇంకా టాప్ 5 పక్కా అనుకున్న సీరియల్ యాక్టర్ భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఆయన హౌస్ లో ఆట కన్నా బంధాలు పెట్టుకుని తన ఆటని తానే రిస్క్ లో పడేసుకున్నాడు. భరణికి హౌస్ లో తనూజ, దివ్య రూపంలో ఒకరు కూతురు, మరొకరు చెల్లి అంటూ ఆయన ఆటని సరిగా ఆడనివ్వలేదు. బిగ్ బాస్ సీజన్ 9లో భరణి ఎలిమినేషన్ హౌస్ మెట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. ఐతే ఈ ఎలిమినేషన్ లో ట్విస్ట్ కూడా ఉంది.

భరణి, రాములను డేంజర్ జోన్ లో..

సీజన్ 9 ఆదివారం దీపావళి ఎపిసోడ్ నిర్వహించారు బిగ్ బాస్ టీం. ఆట పాటలతో రాత్రి 7 గంటలకే షో మొదలైంది. నిన్న బిగ్ బాస్ షోలో హైపర్ ఆది కంటెస్టెంట్స్ కి హింట్స్ ఇవ్వడంతో పాటు సింగర్ సాకేత్ తో ఒక పేరడీ సాంగ్ ని కూడా పాడించారు. జటాధర టీం కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద వచ్చి సందడి చేసింది. బిగ్ బాస్ సీజన్ 9లో లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. నాగార్జున ఒక్కొక్కరిని సేఫ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా ఇద్దరిని భరణి, రాములను డేంజర్ జోన్ లో పెట్టారు.

భరణి, రాములు లీస్ట్ టూ గా ఉన్నప్పుడు ఎవరిని ఆడియన్స్ సేవ్ చేశారు.. ఎవరిని ఎలిమినేట్ చేయాలని అనుకున్నారో రివీల్ చేయకుండా ఇమ్మాన్యుయెల్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర ఉపయోగించి ఒకరిని సేఫ్ చేయొచ్చు అని నాగార్జున అడుగుతాడు. ఇమ్మాన్యుయెల్ రాముని సేఫ్ చేసేందుకు వాడతా అంటాడు. అలా తన పవర్ అస్త్ర వాడటం వల్ల రాము సేఫ్ అయ్యాడు. ఐతే అక్కడ ఆడియన్స్ కూడా ఓటింగ్ లో రాముని సేఫ్ చేసి భరణిని ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు.

ఇమ్మాన్యుయెల్ ఒకవేళ భరణిని సేఫ్ చేసి ఉంటే..

ఇమ్మాన్యుయెల్ ఒకవేళ భరణిని సేఫ్ చేసి ఉంటే అతను హౌస్ లో ఉండే వాడు సేఫ్ అయిన రాము ఎలిమినేట్ అయ్యేవాడు. ఐతే ఇమ్మాన్యుయెల్ రాము రిస్క్ లో ఉంటాడని అనుకుని అతని కోసం పవర్ అస్త్ర ఉపయోగించాడు. ఫైనల్ గా భరణికి ఇమ్మాన్యుయెల్ ఇచ్చిన షాక్ వల్ల అతను ఎలిమినేట్ అయ్యాడు. భరణి ఎలిమినేషన్ టైం లో తనూజ, దివ్య ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. భరణి తనంతట తాను చేజేతులారా తన ఆట చెడగొట్టుకున్నాడు. సీరియల్స్ లో విలన్ గా పాపులర్ అయిన భరణి బయట చాలా మృదుస్వభావి అన్న విషయం మాత్రం ఆడియన్స్ కు అర్థమైంది.