బిగ్ బాస్ 9.. సీరియల్ విలన్ అక్కడ కూడా..?
బిగ్ బాస్ సీజన్ 9లో సీరియల్ లో విలన్ గా సూపర్ క్రేజ్ ఉన్న భరణి శంకర్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు.
By: Ramesh Boddu | 8 Oct 2025 11:37 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో సీరియల్ లో విలన్ గా సూపర్ క్రేజ్ ఉన్న భరణి శంకర్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ సెలబ్రిటీ కేటగిరిలో వచ్చిన కంటెస్టెంట్ అతను. హౌస్ లోకి రావడమే అతన్ని చూసి అందరు షాక్ అయ్యారు. ఐతే అతను బిగ్ బాస్ కి వచ్చింది తనకు సీరియల్ ద్వారా వచ్చిన ఇమేజ్ కాదు తానేంటో జనాలకు తెలియాలని ఆ విలనిజం తాను కాదని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఐతే హౌస్ లో విలనిజం లేదు కానీ తన ఆట తీరుతో హౌస్ మెట్స్ కి కన్ ఫ్యూజన్ ఏర్పడేలా చేస్తున్నాడు భరణి.
తనూజ అతన్ని నాన్న నాన్న అంటూ..
ఓ పక్క తనూజ అతన్ని నాన్న నాన్న అంటూ వెంట పడుతుంది. సో ఆమెను కూతురిలా భావిస్తూ ఆమెకు కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నాడు భరణి. ఇది గమనించిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య కూడా భరణి స్ట్రాంగ్ అని తెలిసి అతన్ని బ్రదర్ అంటూ ఫాదర్ ఫిగర్ అంటూ క్లోజ్ అవుతుంది. దివ్య హౌస్ లోకి వచ్చీ రాగానే భరణినే ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టింది. సో అతనికి క్లోజ్ అవ్వడం వల్ల హౌస్ లో కొన్నాళ్లు ఉండొచ్చనే ప్లాన్ ఆమె ప్లాన్ కావొచ్చు.
ఐతే భరణినే టార్గెట్ చేస్తూ అతనంతా ఆట కోసమే ఇలా చేస్తున్నాడు. కొందరిని కావాలనే తొక్కేస్తున్నాడంటూ ఇటు సంజన, శ్రీజ ఫీల్ అవుతున్నారు. మిగతా వాళ్లంతా కూడా భరణి మీద తటస్థంగా ఉన్నా కొంతమంది మాత్రం పూర్తిగా అతను ఆట ప్రకారంగానే నెగిటివ్ గా ప్లే చేస్తున్నాడని అనుకుంటున్నారు. మరి సీరియల్ లో నెగిటివిటీని పోగొట్టడానికి వచ్చిన భరణి హౌస్ లో అలాంటి థోరణి చూపించకపోయినా తన ఆట తీరు మాత్రం ఎవరికీ అర్దం కావట్లేదు.
సీరియల్ లో అతని విలన్ రోల్స్ కి..
ఎవరు తనని మాటలు అంటున్నా సరే సైలెంట్ గా ఉంటున్నాడు. రీజన్స్ చెప్పాలని చూస్తున్నా అవి అంతగా ఫోర్స్ ఫుల్ గా అనిపించట్లేదు. సీరియల్ లో అతని విలన్ రోల్స్ కి బయట జనాలు కూడా భయపడే వారని చెప్పిన భరణి హౌస్ లో మాత్రం కొన్ని రిలేషన్స్ కి బందీగా మారి తన ఒరిజినాలిటీ మిస్ అవుతున్నాడన్న భావన ఆడియన్స్ లో ఉంది. మరి భరణి ఈ సేఫ్ గేమ్ ప్లాన్స్ ని పక్కన పెట్టి తనకున్న సీరియల్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా ఆడితే తానొక విన్నర్ మెటీరియల్ అన్నది గుర్తిస్తే బెటర్ అని కొందరు భరణి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న భరణి ఐదువారాల ఆట ఇలా ఉండగా ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయని తెలుస్తుండగా వాళ్లు వచ్చాక కూడా తన ఆట ఇలానే ఉంటుందా టాప్ గేర్ వేస్తాడా అన్నది చూడాలి.