Begin typing your search above and press return to search.

టికెట్ టు ఫినాలే టాస్క్ లో భరణి ఫైర్.. మ్యాటర్ డైవర్షన్ పాయింట్ తో షాక్..!

బిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో భరణి ఫైర్ అవ్వడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

By:  Ramesh Boddu   |   6 Dec 2025 3:05 PM IST
టికెట్ టు ఫినాలే టాస్క్ లో భరణి ఫైర్.. మ్యాటర్ డైవర్షన్ పాయింట్ తో షాక్..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో భరణి ఫైర్ అవ్వడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో రీతు చౌదరి తన ప్రత్యర్ధిగా భరణిని ఎంచుకుంది. అతనితో కలిసి ఒక టాస్క్ ఆడింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం రీతు, భరణి ఇద్దరు కూడా ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్ బాక్స్ లు తమకు ఇచ్చిన బోర్డ్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఐతే ఈ టాస్క్ కి సంజన సంచాలక్ గా చేసింది. రీతు పెట్టిన ట్రయాంగిల్ సరిగా లేదని భరణి పాయింట్ రేజ్ చేశాడు. సంజన ఆల్రెడీ రీతుని విన్నర్ గా అనౌన్స్ చేశాక భరణి గొడవ మొదలు పెట్టాడు.

ఆవేశంతో భరణి..

ఈ క్రమంలో రీతు భరణి వేయాల్సిన రింగ్ ని దాచేస్తుంది. అలా చేయడం మిస్టేక్ కాగా సంచాలక్ సంజన ఆ విషయం గురించి మాట్లాడలేదు. ఐతే ఇదే విషయంలో భరణి డీమాన్ పవన్, రీతుల గురించి మాట్లాడుతూ డీమాన్ పవన్.. కళ్యాణ్ కెప్టెన్ గా అయ్యేందుకు షూస్ తో హింట్ ఇచ్చిన వీడియో గురించి మాట్లాడాడు. ఐతే కళ్యాణ్ మధ్యలో కలగచేసుకుని ఆ వీడియో నేను కన్ఫెషన్ రూం లో చూశా ఇప్పటివరకు ఆ విషయం గురించి డీమాన్ కి చెప్పలేదని వాదించాడు.

భరణి ఇంకాస్త ఆవేశంతో నేను నీ పేరు చెప్పలేదు కదా అంటూ ఆవేశం చూపించాడు. మొత్తానికి భరణి టాస్క్ ఓడాడని కాస్త లైన్ దాటి ప్రవర్తించాడని అనిపించింది. ఆ షూస్ సీక్రెట్ గురించి ఇప్పుడు ఈ టైం లో చెప్పడం మాత్రం కరెక్ట్ కాదనే అనిపించింది. అది తప్పని భరణికి అనిపిస్తే అంతకుముందే భరణి చెప్పాలి కానీ ఇప్పుడు అది కూడా ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అన్న క్లారిటీ లేకుండా చెప్పడం ఇంప్రెస్ చేయలేదు.

టికెట్ టు ఫినాలే టాస్క్ లో..

భరణి టికెట్ టు ఫినాలే రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న ఆవేశంలో అలా మాట్లాడాడనిపిస్తుంది. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ లో కళ్యాణ్ గెలిచి మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల తన సత్తా చాటుతున్నాడు. కళ్యాణ్ పడాల దూకుడు చూస్తుంటే ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వొచ్చని అనిపిస్తుంది. ఐతే ఫైనల్ గా ఆడియన్స్ ఎవరిని విజేత చేస్తారన్నద్ రెండు వారాల్లో తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 3 దాదాపు ఫిక్స్ అయినట్టే అని చెప్పొచు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ ఈ ముగ్గురిలోనే టైటిల్ విన్నర్ ఉంటారని దాదాపు డిసైడ్ అయ్యింది.