Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. టాప్ 5లో ఎవరికి ఛాన్స్..?

బిగ్ బాస్ సీజన్ 9 కి ముందే అగ్నిపరీక్ష అంటూ మరో షో మొదలైంది. కామ మ్యాన్ నుంచి సీజన్ 9 కి ఐదుగురిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో ఈ అగ్నిపరీక్ష రోజు రోజుకి టఫ్ ఫైట్ జరుగుతుంది.

By:  Ramesh Boddu   |   28 Aug 2025 12:33 PM IST
బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. టాప్ 5లో ఎవరికి ఛాన్స్..?
X

బిగ్ బాస్ సీజన్ 9 కి ముందే అగ్నిపరీక్ష అంటూ మరో షో మొదలైంది. కామ మ్యాన్ నుంచి సీజన్ 9 కి ఐదుగురిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో ఈ అగ్నిపరీక్ష రోజు రోజుకి టఫ్ ఫైట్ జరుగుతుంది. ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష చూస్తున్న ఆడియన్స్ కామన్ మ్యాన్ గా వచ్చిన ఈ 15 మందిలో ఎవరికి టాప్ 5 అదే హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉందా అని చర్చిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈసారి కామన్ మ్యాన్ గా వచ్చే కంటెస్టెంట్స్ కూడా సెలబ్రిటీ హోదా దక్కించుకునేలా ఈ అగ్నిపరీక్ష షో సపోర్ట్ చేస్తుంది.

15 మందిలో టాప్ ప్లేస్ లో..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో ప్రస్తుతం ఉన్న 15 మందిలో టాప్ ప్లేస్ లో అవకాశం ఉన్న వారిలో షకీబ్ ఉన్నాడు. అతను ఆట మీద కసితో కనిపించాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. తప్పకుండా ఇతన్ని సీజన్ 9 లో చూసే ఛాన్స్ లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఓటింగ్ లో కూడా షాకీబ్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత ప్లేస్ లో దమ్ము శ్రీజ తన సత్తా చాటుతుంది.

ఇక టాప్ 5లో భాగంగా నెక్స్ట్ మనీష్ మర్యాద కూడా ఉంటాడనిపిస్తుంది. అతని థింకింగ్.. మైండ్ గేం కచ్చితంగా అతన్ని హౌస్ కి పంపించేలా ఉంది. ఇక మరోపక్క ప్రవీణ్ కుమార్ కూడా హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. వీరితో పాటుగా కల్కి, దివ్యా, శ్రీయ, హరీష్, కళ్యాణ్ వీళ్లలో కూడా టాప్ 5 కి వెళ్లే క్వాలిటీస్ ఉన్నాయి. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వీళ్లు బిగ్ బాస్ సీజన్ 9 ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 9 లో..

తప్పకుండా బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ 15 మెంబర్స్ లో ఎవరు వచ్చినా కూడా హౌస్ లో మంచి ఫైట్ ఇవ్వడం పక్కా అనిపిస్తుంది. బిగ్ బాస్ ప్రతి సీజన్ లో సెలబ్రిటీస్ తో కామన్ మ్యాన్ ఎప్పుడు ఓటింగ్ లో వెనకపడతారు. కానీ ఈసారి కామన్ మ్యాన్ ని అగ్నిపరీక్ష ద్వారా ఇంట్రడ్యూస్ చేసి వాళ్లకి కూడా కొంత ఫాలోయింగ్ పెరిగేలా చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 తప్పకుండా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.