బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. బాక్సులు బద్ధలు కొట్టేశారు..!
బిగ్ బాస్ సీజన్ 9కి ముందే అగ్నిపరీక్ష అంటూ కామన్ మ్యాన్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే.
By: Ramesh Boddu | 30 Aug 2025 9:51 AM ISTబిగ్ బాస్ సీజన్ 9కి ముందే అగ్నిపరీక్ష అంటూ కామన్ మ్యాన్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 15 మంది కామన్ మెన్ నుంచి ఐదుగురికి హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వస్తుందని తెలుస్తుంది. ఇక రోజుకి కొన్ని టాస్కులతో ఈ 15 మెంబర్స్ తోనే అగ్నిపరీక్ష షో నడిపిస్తున్నారు. ఐతే ఈ షోలో అంచనాలను అందుకోలేక వరస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చే వారికి రోజు ఎల్లో కార్డ్ ఇస్తారు. ఆల్రెడీ మర్యాద మనీష్ అనే వ్యక్తికి ఒక ఎల్లో వచ్చింది.
రెండు ఎల్లో కార్డ్ వస్తే అగ్నిపరీక్ష నుంచి బయటకు..
ఐతే ఎవరైతే రెండు ఎల్లో కార్డ్ అందుకుంటారో వాళ్లు బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో బాక్స్ ఆటతో లీడర్స్ ని ఎంపిక చేశారు. నిన్న స్టార్ ప్లేయర్ అయిన నాగ ప్రశాంత్ ని పిలిచి 12 బాక్సులు అతనికి ఇష్టమున్న వారికి ఇవ్వమన్నారు. ఐతే అందులో లీడర్ అనే ట్యాగ్ ఉన్న బాక్సులు 3 ఉన్నాయి.
ఈ ఆటలో మనీష్, షాకీబ్, పవన్ లను తొలగించారు. నాగ ప్రశాంత్ ఇచ్చిన బాక్సులు సితం స్వాప్ చేసుకోవచ్చని శ్రీముఖి ట్విస్ట్ ఇవ్వగా ఫైనల్ గా ప్రియా, డాలియా, ప్రసన్నలకు లీడర్ ట్యాగ్ వచ్చింది. ఐతే నాగ కావాలనే మనీష్, పవన్, షాకీబ్ లకు ఆ బాక్సులు ఇవ్వకుండా వాళ్లని రిస్క్ లో పెట్టాడు. ఆ విషయంలో షాకీబ్ అప్సెట్ అయ్యి నాగ ప్రశాంత్ తో వాదులాట జరిపాడు.
ముగ్గురు లీడర్స్ కి ఛాన్స్..
ఇక ఈ ముగ్గురు లీడర్స్ కి ముగ్గురు చొప్పున టీం సెలెక్ట్ చేసుకోమని చెప్పి. క్లీనింగ్, వాషింగ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్కులో సంచాలకులుగా బాక్సులు అందుకోక ఆట నుంచి తప్పుకున్న మనీష్, షాకీబ్, పవన్ లు వ్యవహరించారు. ఐతే ఈ టాస్క్ ని టర్న్ తిప్పే అవకాశం సంచాలకుల చేతిలో ఉంది. కానీ ఆ అవకాశం వాళ్లు వినియోగించుకోలేదు.
అందుకే ప్రతి ఎపిసోడ్ చివర్లో స్టార్ ప్లేయర్, వరస్ట్ పర్ఫార్మర్, బెస్ట్ పర్ఫార్మర్ కి ఓటింగ్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చే జ్యూరీ మెంబర్స్ ఈరోజు టాస్క్ వల్ల తమ అసంతృప్తి వ్యక్తపరిచి వెళ్లిపోయారు. ఐతే టాప్ 15 నుంచి ఐదుగురి ఎంపికలో ఇంకా ఎన్ని టాస్కులు ఉన్నాయి. అసలు ఆ ఎంపిక ఎలా జరుగుతుంది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. రోజుకి ఒక టాస్క్ ఇస్తూ లీడర్, టీం అంటూ ఏదేదో చేస్తున్నారు కానీ వీళ్లు బాగా ఆడుతున్నారు.. వీళ్లు అన్ ఫిట్ అనే భావన అయితే ఇప్పటివరకు కలగలేదు. మరి బిగ్ బాస్ అగ్నిపరీక్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.
