రాజకీయ సభను తలపిస్తున్న బిగ్ బాస్.. వర్కౌట్ అవుతుందా?
అయితే అలాంటి బిగ్ బాస్ రియాల్టీ షోకి ఇప్పుడు ఆదరణ తగ్గింది. సీజన్ సీజన్ కి ఈ షో చూసే వీక్షకులు పూర్తిగా తగ్గిపోతున్నారు..
By: Madhu Reddy | 15 Aug 2025 11:44 AM ISTబిగ్ బాస్ రియాల్టీ షో.. ఒకప్పుడు ఈ షోకి ఎంతటి పాపులారిటీ ఉందో చెప్పనక్కర్లేదు.. బిగ్ బాస్ షో వచ్చిన మొదట్లో చాలామంది ఈ షోకి ఆకర్షితులయ్యారు.. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే చాలు చాలామంది ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇక ఈ షో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పట్నుండి షో పూర్తయ్యే వరకు ఇంట్రెస్టింగ్ గా చూసేవారు. అయితే అలాంటి బిగ్ బాస్ రియాల్టీ షోకి ఇప్పుడు ఆదరణ తగ్గింది. సీజన్ సీజన్ కి ఈ షో చూసే వీక్షకులు పూర్తిగా తగ్గిపోతున్నారు..
నిజానికీ హిందీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాల్టీ షోకి భారీ ఆదరణ ఉండేది. కానీ ఈ షో క్రేజ్ కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో రాబోయే బిగ్ బాస్ సీజన్ 19ని సరికొత్త ఫార్మాట్లో తీసుకురాబోతున్నారట మేకర్స్.. మరి సరికొత్త ఫార్మాట్ లో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 19 సక్సెస్ అవుతుందా..? సీజన్ 19 లో చేసే మార్పులు చేర్పులు ఏంటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న హిందీ బిగ్ బాస్ కి ఒకప్పుడు భారీ టీఆర్పీ రేటింగ్ ఉండేది. ఈ షో టీఆర్పీ రేటింగ్ చూసి బిగ్ బాస్ యాజమాన్యం సైతం ఆశ్చర్యపోయేవారు. అయితే అలాంటి బిగ్ బాస్ రియాల్టీ షో క్రేజ్ తగ్గిపోయింది. అయితే దీన్ని గమనించిన నిర్మాతలు బిగ్ బాస్ రియాల్టీ షో తిరిగి ఆదరణ పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 19 ని సరికొత్తగా తీసుకురాబోతున్నారట. ముఖ్యంగా రాజకీయ సభను తలపించబోతుందని సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ 19 లో ఈసారి కొత్త గేమ్స్ ఉంటాయట. ముఖ్యంగా హౌస్ లోకి వెళ్ళిన పోటీదారులు రెండు పార్టీలుగా విడిపోతారని తెలుస్తోంది. అంతేకాదు ఈ రెండు పార్టీలు ప్రస్తుతం రాజకీయాల్లో ఎలా అయితే రెండు మూడు పార్టీలు ఉంటాయో అలాగే హౌస్ లో కూడా రాజకీయాల్లో లాగే రెండు టీంలను చేస్తారట.. ప్రతి ఒక్క విషయాన్ని ఈ రెండు పార్టీలు విడివిడిగా ఉండి చర్చించుకుంటారని తెలుస్తోంది.అయితే హౌస్ లోకి వెళ్లే పోటీ దారులను రెండు పార్టీలుగా విడగొట్టి పాలిటిక్స్ లో ఉన్నట్టు ప్రత్యేకమైన గేమ్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తోంది.. అంతేకాదు బిగ్ బాస్ 19 కి రాజకీయ అంశం అనేది ఒక కొత్త స్పార్క్ ని అందిస్తుందని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారు.
బిగ్ బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు, ప్రేమలు,టాస్క్లు ఇవన్నీ ఉంటాయి.కానీ బిగ్ బాస్ 19లో మాత్రం ఈ గొడవలు, కొట్లాటల్లో మరింత గందరగోళం చేసి షో చూసే ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారట.. కానీ ఈ విషయం బయటికి రావడంతో చాలామంది నెటిజన్స్ అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే గొడవలు , కొట్లాటలు వంటివి ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో రియల్ లైఫ్ లో రాజకీయాల లాంటివి హౌస్ లో కూడా తీసుకువస్తే పోటీ దారుల మధ్య మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు.
నిజానికీ ఇలాంటి గొడవలు, కొట్లాటలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా సీజన్లలో ఇలాంటి ఇష్యూస్ మనం చూసే ఉంటాం.. అయితే హౌస్ లో ఇలాంటి గొడవలు ఉంటేనే షో చూసేవారికి నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే నెక్స్ట్ రాబోయే సీజన్ 19 లో ఈ గొడవలను మరింత ముదిరేలా చేసి షో చూసే వారిలో ఆసక్తి పెంచాలని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి బిగ్ బాస్ మేకర్స్ చేసిన ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
