Begin typing your search above and press return to search.

ఓ మై గాడ్.. ఆ సినిమాకు 35 రోజులు రీ షూట్ చేయాలంట!

సినిమా అంటే ముందు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత స్ట్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక సెట్స్ పైకి వెళ్తుంది.

By:  M Prashanth   |   13 Sept 2025 2:00 AM IST
ఓ మై గాడ్.. ఆ సినిమాకు 35 రోజులు రీ షూట్ చేయాలంట!
X

సినిమా అంటే ముందు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత స్ట్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక సెట్స్ పైకి వెళ్తుంది. దీంతో షూటింగ్ ప్రారంభిస్తారు. ఏ సినిమానైనా షెడ్యూళ్లు ప్రకారం, అవసరమైనన్ని పలు లొకేషన్లలో షూట్ చేస్తారు. అయితే ఇక్కడ షూటింగ్ అనేది టీమ్ కు పెద్ద సవాల్ తో కూడుకున్న పని.

టెక్నిషియన్లు, డ్యాన్సర్లు, కెమెరా మెన్లు, మెకప్ ఆర్టిస్ట్ లు, ఆటగాళ్లు, పాటగాళ్లు, నటీనటులు, ఇతక సాంకేతిక నిపుణులు ఇలా దాదాపు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన వ్యక్తులు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక్క చిన్న షాట్ అనుకున్నట్లు రాకపోయినా.. మళ్లీ రీ షూట్ చేస్తారు. షూటింగ్ లొకేషన్, కాస్ట్ అందరికీ ఫుడ్ ఇతరత్రా ఖర్చులు బోలెడు ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయన్లుకు అయితే రవాణా ఖర్చులు సైతం భరించాల్సి ఉంటుంది.

అలా దాదాపు 100- 125 రోజులు పాటు ఒక్కో సినిమాను షూటింగ్ చేసి కంప్లీట్ చేస్తారు. ఒక్కో రోజు సినిమా బడ్జెట్ ను బట్టి ఖర్చు ఉంటుంది. అది వేలల్లో నుంచి కోట్ల దాకా అవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా షూటింగ్ చేస్తారు మేకర్స్. అయితే లేటెస్ట్ గా తెరకెక్కుతున్న ఓ భారీ సినిమాకు అతిపెద్ద కష్టం వచ్చింది. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమై అంతా సవ్యంగా జరుగుతుందని అనుకుంటే.. ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ ఎదురైంది.

ఆ సినిమా 35 రోజులు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కారణాలు ఏమో తెలియదు కానీ, ఇప్పుడు అదంతా మళ్లీ రీ షూట్ చేయాల్సి వచ్చిందని తెలిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటినుంచి ఏకంగా 35 రోజుల రీ షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ లెక్కన సినిమా కాస్ట్ మరింత పెరిగిపోతుంది. ఇది మేకర్స్ కు అదణపు భారంగా మారతుంది. పెద్ద సినిమా కి అన్ని రోజులు రీ షూట్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.