రాజమౌళి తర్వాత రావిపూడి అనిల్..!
తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ ఆయన. రాజమౌళి రాజ ముద్రతో సినిమా వచ్చింది అంటే అది సూపర్ హిట్ పక్కా అన్నట్టే లెక్క.
By: Ramesh Boddu | 12 Jan 2026 12:30 PM ISTస్టార్ హీరో ఉన్నా యంగ్ యాక్టర్ ఉన్నా ఒక సినిమా హిట్ కొట్టాలంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అదే డైరెక్టర్ పనితనం బాగుండాలి. రాసుకున్న కథ దగ్గర నుంచి సెట్స్ మీద సినిమాకు తీసుకెళ్లడం అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసి అనుకున్న టైం కి రిలీజ్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. డైరెక్టర్ గా తమకు వచ్చిన అవకాశాలను సక్సెస్ లుగా మలచి కెరీర్ స్ట్రాంగ్ చేసుకోవడం అన్నది వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని డైరెక్టర్ గా రాజమౌళి పేరు మారు మోగుతుంది.
రాజమౌళి రాజ ముద్రతో సినిమా..
తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ ఆయన. రాజమౌళి రాజ ముద్రతో సినిమా వచ్చింది అంటే అది సూపర్ హిట్ పక్కా అన్నట్టే లెక్క. ఇక బాహుబలితో తెలుగు సినిమాను వరల్డ్ సినిమాల పక్కన చేర్చాడు రాజమౌళి. ఐతే రాజమౌళి తర్వాత తెలుగులో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఓటమి ఎరుగని దర్శకుడిగా అదరగొట్టేస్తున్నాడు అనిల్ రావిపూడి.
పటాస్ సినిమా నుంచి ఈరోజు రిలీజైన మన శంకర వరప్రసాద్ వరకు అనిల్ సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నాడు. చేసిన 9 సినిమాలు హిట్లుగా మలచి సత్తా చాటాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తన సినిమాకు అన్నీ తానై తీసే ప్రతి సినిమాను బెటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా చేస్తుంటాడు. ఐతే రాజమౌళి సినిమాల బడ్జెట్ భారీగా ఉంటుంది. అంతేకాదు సినిమాలు కూడా 3, 4 ఏళ్లు తీస్తాడు. అఫ్కోర్స్ ఆ సినిమాల రిజల్ట్ కూడా దానికి తగినట్టుగానే ఉంటుందని తెలిసిందే.
అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్..
ఐతే అనిల్ పంథా వేరు సింపుల్ కథతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే అతని టార్గెట్. అదే తన ఫస్ట్ సినిమా పటాస్ నుంచి ఫాలో అవుతున్నాడు. అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంచక్కా వెళ్లి ఎంజాయ్ చేసే పరిస్థితి ఏర్పడింది. థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ రావట్లేదన్న మాట ఎక్కువ వినిపిస్తుంది. కానీ ఫెస్టివల్ టైం లో అనిల్ రావిపూడి సినిమా వస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాలను ఆదరిస్తున్నారు.
రాజమౌళితో కంపారిజన్ కాదు కానీ 3, 4 ఏళ్లలో ఆయన భారీ సినిమాలు తీసి తెలుగు మార్కెట్ లోనే 400, 500 కోట్ల వసూళ్లను వచ్చేలా చేస్తాడు. అనిల్ రావిపూడి మాత్రం సంక్రాంతి ఫెస్టివల్ కి వచ్చే సినిమాతో కంటిస్టెంట్ హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు. రాజమౌళి, అనిల్ రావిపూడి ఈ ఇద్దరు దర్శకులు ఇప్పటివరకు ఫెయిల్యూర్ అన్నది చూడలేదు.
సినిమా పట్ల వారికున్న కమిట్మెంట్.. రాసుకున్న కథను ఎలా తీయాలన్న పర్ఫెక్షన్ ఇలా ప్రత్యేకమైన క్వాలిటీస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు. అందుకే భారీ సినిమాలతో రాజమౌళి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో రావిపూడి దూసుకెళ్తున్నారు. ఈ ఇద్దరు ఇలానే తెలుగు పరిశ్రమకు మరిన్ని సక్సెస్ లు ఇచ్చేలా చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు.
