సందీప్‌రెడ్డి వంగని ఆకాశానికి ఎత్తేస్తున్న నిర్మాత!
రణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్` వంటి సంచలన బ్లాక్ బస్టర్‌ని అందించిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం అంతకు మించిన యాక్షన్ డ్రామాతో చేస్తున్న మూవీ `స్పిరిట్`.
By: Ravindar Gorantla | 3 April 2026 4:00 AM ISTరణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్` వంటి సంచలన బ్లాక్ బస్టర్‌ని అందించిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం అంతకు మించిన యాక్షన్ డ్రామాతో చేస్తున్న మూవీ `స్పిరిట్`. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీని ప్రణయ్ రెడ్డి వంగతో కలిసి టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్ కుమార్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. `యానిమల్` ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో కాంచన, వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య దేశాయి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటకే విడుదల చేసిన ఫస్ట్ లుక్, డైలాగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి కొంత భాగం షూటింగ్ జరుపుకున్న నేపథ్యంలోనే దర్శకుడు సందీర్ రెడ్డి వంగ రిలీజ్ డేట్‌ని ప్రకటించి షాక్ ఇవ్వడం తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని 2027 మార్చి 5న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించి దర్శకుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇదిలా ఉంటే ఇందులో తొలిసారి ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడన్నది తెలిసిందే. డ్రగ్స్ మాఫియా చుట్టూ అల్లుకున్న కథగా దీన్ని సందీప్ తెరపైకి తీసుకొస్తున్నారు.
ఎమోషనల్ గానూ కొత్తగా ఉంటుందని, ప్రభాస్ క్యారెక్టర్, మేకోవర్ చాలా భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడాని ప్లాన్ చేస్తున్నారు. ఆ కారణంగానే ఫర్‌ఫెక్ట్ రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకున్నారు. ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ కోసం చాలానే శ్రమిస్తున్నారట. ఒకే సమయంలో `ఫౌజీ`, కల్కి 2తో పాటు ఈ సినిమాకు కూడా డేట్స్ కేటాయించడంతో ప్రభాస్ షెడ్యూల్ బిజీ బిజీగా మారిపోయింది.
ఈ బిజీ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోవడానికి ఇటీవలే సమ్మర్ వెకేషన్ కోసం ప్రభాస్ ఇటలీ వెళ్లారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగపై నిర్మాత భూషన్ కుమార్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా అండర్ ప్రొడక్షన్‌లో ఉండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసినభూషన్ కుమార్ ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ సోదరుల్ని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు.
వీరిద్దరికి ఎలాంటి ఈగో లేదని, ఇద్దరూ ఎప్పుడూ వర్క్ గురించే ఆలోచిస్తుంటారని చెప్పుకొచ్చారు. ఒక గ్రేట్ మూవీని చేయాలనే పట్టుదలతో వర్క్ చేస్తున్నారు. కొన్ని సీన్స్ నేను చూశాను. సందీప్‌రెడ్డి వంగ మరో మార్వలెస్ మూవీతో రాబోతున్నాడు. ఇదొక కాప్ స్టోరీ. ఇందులో ఎమోషన్ ఉంది. అయితే సినిమాని సందీప్ ప్రజెంట్ చేసే విధానం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇదిత్యధర్ `ధురంధర్`ని ఎంత కొత్తగా రూపొందించాడో అదే స్థాయిలో ఈ సినిమాని సందీప్ చేస్తున్నాడు. ఈ సినిమాతో సందీప్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నాడు. గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో రాబోతోంది. దీని కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను` అంటూ హైప్ ఇచ్చాడు.
