12 ఏళ్ల వయసులోనే అలాంటి పని చేసిన భూమిక.. షాక్ లో ఫ్యామిలీ!
అయితే హీరోయిన్ గా కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది భూమిక.
By: Madhu Reddy | 3 Feb 2026 4:00 PM ISTభూమిక చావ్లా.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా 2000వ సంవత్సరంతో మొదలైన ఆమె సినీ ప్రయాణం నేడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అంతే వేగంగా దూసుకుపోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. 2000వ సంవత్సరంలో 'యువకుడు' అనే సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన భూమిక ఆ తర్వాత ఖుషి, ఒక్కడు , సింహాద్రి, జై చిరంజీవ లాంటి చిత్రాలలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్, తెలుగు, హిందీ అంటూ వరుస చిత్రాలలో నటించిన ఈమె అటు పంజాబీ చిత్రంలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇకపోతే 2007 అక్టోబర్ 21న చిరకాల ప్రియుడు, యోగా టీచర్ అయిన భరత్ ఠాకూర్ ను ప్రేమించి మరీ.నాసిక్ లోని దేవ్ లాలీలోని గురుద్వారాలో వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఒక కొడుకు కూడా జన్మించారు. ఇక కొడుకు పుట్టిన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన భూమిక మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే హీరోయిన్ గా కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది భూమిక. ఇప్పటివరకు లడ్డు బాబు, ఏప్రిల్ ఫూల్, మిడిల్ క్లాస్ అబ్బాయి, యూటర్న్, సవ్యసాచి , పాగల్, ఇదే మా కథ, సిటీ మార్, సీతాకోకచిలుక వంటి చిత్రాలలో నటించిన ఈమె ఇప్పుడు తాజాగా యుఫోరియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా అందులో పాల్గొన్న భూమిక ఎన్నో విషయాలను పంచుకుంది. ఆ క్రమంలోనే తాను చిన్న వయసులోనే అలాంటి పని చేసి తన ఫ్యామిలీని ఆశ్చర్యపరిచినట్లు చెప్పుకొచ్చింది. భూమిక మాట్లాడుతూ.. "నేను చదువులో టాపర్ని కాకపోయినా డిస్టింక్షన్ లో మాత్రం కచ్చితంగా పాస్ అయ్యేదాన్ని. అయితే తొమ్మిదో తరగతిలో ఉండగానే నేను గుర్రపు సారీ నేర్చుకున్నాను. ఇక ఈ విషయాన్ని నా కుటుంబంతో చెప్పినప్పుడు వారు షాక్ అయ్యారు. అలా 12 ఏళ్ల వయసులోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నాను" అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది భూమిక.
ఇకపోతే తాను స్కూల్లో ఉన్నప్పుడు ఫ్యాషన్ షోలు, డిబేట్లు వంటివి వాటిల్లో పాల్గొంటూ ఉండేదాన్ని అని తెలిపింది. ఇక అందులో బొమ్మలా.. ముద్దుగా కనిపించడంతో అందరూ గుడియా అని ముద్దుగా పిలిచేవారట. అంతేకాదు ఇప్పుడు ఇంట్లో కూడా అలాగే పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఇకపోతే తన పేరు రచనా చావ్లా అని.. సినిమాల్లోకి వచ్చాకే భూమికగా మార్చుకున్నట్లు తెలిపింది భూమిక. ఏది ఏమైనా 12 ఏళ్ళ వయసులోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నానని చెప్పి అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది.
