Begin typing your search above and press return to search.

హీరోయిన్ బ్రాండెడ్ వాట‌ర్ బాటిల్ రూ.200.. కుళాయి నీళ్లు ఆపేయండి!

అవును .. మీరు విన్న‌ది నిజ‌మే.. ఒక వాట‌ర్ బాటిల్ ధ‌ర.200 .. కంపెనీ ప్రారంభించిన‌ది మ‌రెవ‌రో కాదు.. ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫెడ్నేక‌ర్.

By:  Sivaji Kontham   |   12 Aug 2025 12:54 PM IST
హీరోయిన్ బ్రాండెడ్ వాట‌ర్ బాటిల్ రూ.200.. కుళాయి నీళ్లు ఆపేయండి!
X

అవును .. మీరు విన్న‌ది నిజ‌మే.. ఒక వాట‌ర్ బాటిల్ ధ‌ర.200 .. కంపెనీ ప్రారంభించిన‌ది మ‌రెవ‌రో కాదు.. ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫెడ్నేక‌ర్. త‌న సోద‌రి స‌మీక్ష ఫెడ్నేక‌ర్‌తో క‌లిసి ఈ ప్ర‌యోగం చేస్తోంది. స్వ‌చ్ఛ‌మైన హిమానీ నద‌ము(న‌దులు)ల నుంచి సేక‌రించిన నీటిని భూమి ఫిల్ట‌ర్ చేసి `హిమాల‌య‌న్` పేరుతో అందిస్తోందిట‌. ఈ నీరు త‌యారీకి అస‌లు మాన‌వ ప్ర‌మేయం ఉండ‌ద‌ని, అస‌లు మనిషి చెయ్యి కూడా క‌నీసం తాక‌ద‌ని, దీనివ‌ల్ల క‌లుషితం అయ్యేందుకు ఆస్కారం లేద‌ని చెబుతోంది. దీనికోసం త‌న సోద‌రితో క‌లిసి రెండేళ్లుగా ప‌ని చేస్తున్నాన‌ని భూమి వెల్ల‌డించింది.

ఎగ‌తాళి చేస్తున్నారు భూమీ..

ఈ వాట‌ర్ బాటిల్ రెండు వేరియెంట్ల‌లో లభిస్తుంది. 500 ఎం.ఎల్ ప్రీమియం వాట‌ర్ బాటిల్ ధ‌ర రూ.150 కాగా, 750 ఎం.ఎల్ వాట‌ర్ బాటిల్ ధ‌ర రూ.200. ఈ విష‌యాన్ని భూమి ఫెడ్నేక‌ర్ అధికారికంగా ప్ర‌కటించ‌గానే దీనిపై ర‌క‌ర‌కాల స్పంద‌న‌లు వ‌చ్చాయి. వీటిలో కొన్ని ఘాటైన విమ‌ర్శ‌లు, ఎగ‌తాళి కామెంట్లు కూడా ఉన్నాయి.

అమూల్ టెట్రా ప్యాక్‌లాగా..

200 బాటిల్ ధ‌ర అంటే బాటిల్ లో వైన్ లేదా అమృతం పోసి అమ్ముతోందా? అంటూ ఒక నెటిజ‌న్ కామెంట్ చేసాడు. ఇక‌పై కుళాయి నీళ్లు తాగ‌డం మానేస్తాన‌ని మ‌రొక పోకిరి కామెంట్ చేసాడు. ఈ ధ‌ర‌లు సామాన్యుల‌కు చాలా అందుబాటులో ఉన్నాయి! అంటూ మ‌రొక‌రు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భూమి బ్రాండ్ వెలిగిపోవ‌డం గ్యారెంటీ! అంటూ వ్యాఖ్యానించారు ప‌లువురు. అమూల్ టెట్రా ప్యాక్ లాగా ధ‌ర బావుంద‌ని ఒక వ్య‌క్తి కామెంట్ చేసాడు.

దీపిక కంపెనీ అలా అయింది:

మొత్తానికి భూమి ఫెడ్నేక‌ర్ ఉద్ధేశం ఏదైనా కానీ, ఇంత ఖ‌రీదైన ప్రీమియం మంచి నీళ్ల‌ను అందుబాటులోకి తెచ్చినందుకు తీవ్రంగా విమ‌ర్శ‌ల పాలైంది. ఇటీవ‌లే ప్ర‌ముఖ క‌థానాయిక‌ దీపిక ప‌దుకొనే ప్రారంభించిన సౌంద‌ర్య ఉత్ప‌త్తుల కంపెనీ కేవ‌లం అధిక ధ‌ర‌ల కార‌ణంగా, మ‌ధ్య‌త‌ర‌గ‌తికి అందుబాటులో లేని ఉత్ప‌త్తుల కార‌ణంగా దివాళా తీసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు భూమి ఫెడ్నేక‌ర్ ప్రీమియం బ్రాండ్ పేరుతో అందుబాటులో లేని ఉత్ప‌త్తుల‌ను తాయ‌రు చేస్తోంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. హిమాల‌యాల్లో ఉచిత నీరును ఇలా ధ‌నాశ‌తో అమ్మేస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. భూమి బ్రాండ్ ను కొనుక్కునే ధ‌ర‌ల‌తో పాలు, ఎన‌ర్జీ డ్రింక్స్ సులువుగా కొనుక్కోగ‌ల‌మ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. భూమికి సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. అందుకే ఇప్పుడిలా ప్ర‌యోగాలు చేస్తోందంటూ ఒక‌రు కామెంట్ చేసారు.

అదీ సంగ‌తి...

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఈ ఏడాది భూమి ఒకే ఒక్క సినిమాలో న‌టించింది. ర‌కుల్, అర్జున్ క‌పూర్ ల‌తో క‌లిసి మేరే హ‌జ్బెండ్ కి బివీలో న‌టించింది. ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. త‌ర్వాత భూమి మ‌రొక సినిమాకి సంత‌కం చేయ‌లేదు. వ‌రుస ఫ్లాపుల‌తో ఈ బ్యూటీ రేసులో వెన‌క‌బ‌డింది.