విమర్శలతో నెలల తరబడి కన్నీటి పర్యంతం!
కానీ బాలీవుడ్ హాట్ లేడీ భూమీ పడ్నేకర్ `ది రాయల్స్` సిరీస్ పై వచ్చిన విమర్శలకు గానూ నెలలు తరబడి కృంగిపోయిందని ఎంత మందికి తెలుసు? అవును ఈ విషయాన్ని భూమీ స్వయంగా రివీల్ చేసింది.
By: Srikanth Kontham | 28 Jan 2026 3:00 PM ISTసినిమా ప్లాప్ అయితే నటీనటులపై నెట్టింట విమర్శలు..ట్రోలింగ్ సహజం. ఇందులో మొదట టార్గెట్ అయ్యేది? దర్శకుడు..ఆ తర్వాత హీరో. ఈ విషయంలో ఎవరూ తప్పించుకోలేరు. లెజెండరీ నటులు సైతం విమర్శలు ఎదుర్కున్న వారే. ఇలా విమర్శలు తరుచూ చూసే సరికి అవన్నీ అలవాటుగా మారిపోతాయి. కాల క్రమంలో వాటిని పట్టించుకోవడం మానేస్తారు. కానీ బాలీవుడ్ హాట్ లేడీ భూమీ పడ్నేకర్ `ది రాయల్స్` సిరీస్ పై వచ్చిన విమర్శలకు గానూ నెలలు తరబడి కృంగిపోయిందని ఎంత మందికి తెలుసు? అవును ఈ విషయాన్ని భూమీ స్వయంగా రివీల్ చేసింది.
గత ఏడాదే `ది రాయల్స్` భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదొక మోర్పురు రాయల్ కుటుంబం చుట్టూ తిరిగే కథ. అప్పటి రాచరికాన్ని-విలాస వంతమైన జీవితాన్నిఈ కాలంలో కొనసాగించి అప్పులు పాలయ్యే ఓ రాజ కుటుంబ కథే ది రాయల్స్ సిరీస్. మోర్పూరు సామ్రజ్య వారసుడిగా ఇషాన్ కట్టర్ -జీవితంలో ఎదగాలనే అమ్మాయిగా భూమీ పడ్నే కర్ పాత్రలు ప్రచార చిత్రాల వరకూ బాగా ఆకట్టుకున్నాయి. కుప్పకూలిపోతున్న సామ్రాజ్యాన్ని భూమీ నిలబెట్టే ప్రయత్నం ఎలా చేసింది? అవిరాజ్- సోఫియా పాత్రల నేపథ్యం ఆసక్తికరంగా ఉంది.
ఇషాన్ కట్టర్-భూమీ పడ్నేకర్ మధ్య రొమాంటిక్ ఇంటిమేట్ సన్నివేశాలు సిరీస్ కి కలిసొచ్చాయి. కానీ రిలీజ్ అనంతరం సిరీస్ పై ఎన్నో విమర్శలొచ్చాయి. అవన్నీ భూమి పడ్నేకర్ ను ఎంతో నిరాశకు గురిచేసాంది. వాటి కారణంగా మానసికంగాను ఎంతో అలసిపోయానంది. ఆ ఎదురు దెబ్బతో నటిగా, వ్యక్తిగా తాను ఎవరో? అన్నది కూడా మర్చిపోయి వ్యవహరించానంది. ఆ విమర్శలు కారణంగా ఏకంగా తొమ్మిది నెలలు పాటు ఎలాంటి సినిమాలు చేయకుండా దూరంగా ఉన్నానంది. చివరికి తీసుకున్న అడ్వాన్స్ లు కూడా తిరిగి ఇచ్చేసానని తెలిపింది.
ఆ విమర్శలు వ్యక్తిగతంగా బాధించడంతో గుర్తొచ్చినప్పుడల్లా కన్నీటి పర్యంతం చెందేదానినని గుర్తు చేసుకుంది. కెరీర్ లో ఎప్పుడు ఇలా గ్యాప్ తీసుకోలేదంది. కేవలం సినిమాలను తిరస్కరించడమే కాదు మీడియాలో తన ఉనికిని కూడా తానే తగ్గించుకున్నట్లు అయిందన్నారు. అవార్డు కార్యక్రమాలకు, ఫ్యాషన్ ఈవెంట్లకు కూడా హాజరు కానని అదే సమయంలో చెప్పినట్లు గుర్తు చేసుకుంది. ఇలా అన్నింటిని దూరం చేసుకున్నా? సొంతంగా ఎలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలనో కూడా ఈ గ్యాప్ లోనే తెలుసుకున్నానంది. ఈ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ప్రయాణాలు చేయడం వంటివి చేసానంది. విమర్శలు కూడా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయంది.
