'భోళా బాలయ్య'.. ఈ బర్త్ డే ఎప్పటికీ మర్చిపోలేమా?
అయితే ఈసారి బాలయ్య వేడుకల ప్రత్యేకత కేవలం హైదరాబాద్ కే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమాన సంఘాలు ఒకేసారి సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.
By: M Prashanth | 5 Jun 2026 9:54 AM ISTటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగ. ప్రతి ఏడాది ఆయన బర్త్ డేను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. ఏడాది అంతా ఆ ఒక్క రోజు కోసం చాలా వెయిట్ చేస్తుంటారు. అయితే మరో రెండు రోజుల్లో బాలయ్య బర్త్ డే ఉండగా.. ఈసారి మాత్రం పుట్టినరోజు వేడుకలు మరో రేంజ్ లో ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా సోషల్ మీడియాలో విడుదలైన 'భోళా బాలయ్య' పోస్టర్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే ఈసారి బర్త్ డే వేడుకలు బాలయ్య అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారనున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఆ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. భోళా బాలయ్య అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.
జూన్ 7న జరగనున్న వేడుకలకు సంబంధించిన శ్రేయాస్ మీడియా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. "ది వెయిట్ ఈజ్ ఓవర్.. ది సెలబ్రేషన్ బిగిన్స్" అనే క్యాప్షన్ తో వచ్చిన ఆ పోస్టర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా 'భోళా బాలయ్య' అనే కాన్సెప్ట్ ను ముందుకు తీసుకురావడం విశేషంగా మారింది.
పోస్టర్ లో పరమశివుడి రూపానికి బాలకృష్ణ పేస్ ను యాడ్ చేస్తూ రూపొందించిన డిజైన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలయ్యను దేవుడిలా ఆరాధించే అభిమానులకు ఆ పోస్టర్ మరింత కనెక్ట్ అవుతోంది. అందుకే విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిపోయింది. ఫుల్ గా షేర్ చేస్తూ అభిమానులు సందడి చేస్తున్నారు.
అయితే ఈసారి బాలయ్య వేడుకల ప్రత్యేకత కేవలం హైదరాబాద్ కే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమాన సంఘాలు ఒకేసారి సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు ప్లానింగ్ జరుగుతోంది. 'భోళా బాలయ్య' స్లోగన్ గ్లోబల్ రేంజ్ లో మార్మోగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక హైదరాబాద్ లో జరిగే వేడుకలకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో కంటే భారీ రేంజ్ లో ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, బాలయ్య సినీ జర్నీకి గుర్తు చేసే విజువల్ ప్రజెంటేషన్స్ కూడా ఉండే అవకాశముంది.
మరోవైపు ఎప్పటిలానే ఈసారి కూడా సేవా కార్యక్రమాలకు కూడా ఈసారి పెద్ద పీట వేస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, విద్యార్థులకు అవసరమైన సామగ్రి పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు అభిమాన సంఘాలు సిద్ధమవుతున్నాయి. బాలయ్యపై ఉన్న అభిమానాన్ని సమాజ సేవ రూపంలో చూపించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇటీవల వరుస విజయాలతో బాలకృష్ణ కెరీర్ మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ విజయాల జోష్ కు బర్త్ డే సంబరాలు తోడవడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. అందుకే ఈసారి బాలయ్య పుట్టినరోజు కేవలం ఒక సెలబ్రేషన్ కాదు.. అభిమానుల ఎమోషనల్ సెలబ్రేషన్ గా మారబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోస్టర్ తో మొదలైన హంగామా చూస్తుంటే జూన్ 7న బాలయ్య సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
