Begin typing your search above and press return to search.

మరి ఇంత వైలెన్సా శర్వా..?

శర్వానంద్ సినిమాలంటే సాధారణంగా మంచి కథ, భావోద్వేగాలు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలు గుర్తుకు వస్తాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   4 Oct 2026 4:05 PM IST
మరి ఇంత వైలెన్సా శర్వా..?
X

శర్వానంద్ సినిమాలంటే సాధారణంగా మంచి కథ, భావోద్వేగాలు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలు గుర్తుకు వస్తాయి. కెరీర్ ప్రారంభం నుంచి ఈ హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు శర్వానంద్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న భోగి సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్‌లో శర్వానంద్‌ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటివరకు శర్వానంద్‌ను ఇంత రా అండ్ రస్టిక్ లుక్‌లో ప్రేక్షకులు చూసింది లేదు. టీజర్‌లో ఆయన పాత్ర చాలా మాస్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగులు, రక్తపాతం చూపించే సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఫ్యామిలీ హీరోగా ఎక్కువగా కనిపించిన శర్వానంద్ ఒక్కసారిగా ఇలాంటి వైలెంట్ పాత్రలో కనిపించడం కొత్తగా అనిపిస్తోంది.

భోగి కథ పల్లెటూరి నేపథ్యంలో సాగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. బొగ్గుల గుట్ట అనే గ్రామం చుట్టూ కథ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కుల వివక్ష, అణచివేత, ఆధిపత్యం వంటి సామాజిక అంశాలను సినిమాలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. శర్వానంద్ పాత్ర ఈ సమస్యలకు ఎలా ఎదురొడ్డి నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

టీజర్‌లో శర్వానంద్ చెప్పే డైలాగులు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆయన బాడీ లాంగ్వేజ్, లుక్, యాక్షన్ స్టైల్ గత సినిమాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా, డింపుల్ హయతి కీలక పాత్రలో కనిపించనుంది.

దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాను చాలా రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో భోగి సినిమా థియేటర్లలో మంచి బిగ్ స్క్రీన్ అనుభూతిని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఇటీవల తెలుగు సినిమాల్లో బోల్డ్ కంటెంట్, హింస ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో భోగి టీజర్‌లో కూడా ఇంతటి వైలెన్స్ ఉండటం కొంత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోలు కూడా మాస్, వైలెంట్ పాత్రల వైపు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 12న భోగి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి శర్వానంద్ చేసిన ఈ కొత్త మాస్ ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.