శర్వానంద్ 'భోగి' కి పోటీగా ఎవరు ఉన్నారు?
రెండుసార్లు వాయిదా పడిన శర్వానంద్ ‘భోగి’ నవంబర్ 27న విడుదలకు సిద్ధమైంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి స్పందన వస్తున్నట్లు సమాచారం. అదే రోజు మరికొన్ని చిత్రాలు విడుదలవుతున్నా, ప్రస్తుతానికి బాక్సాఫీస్ బజ్ ‘భోగి’ వైపే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
By: Ramesh Palla | 26 Nov 2026 2:28 PM ISTశర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి ముఖ్య పాత్రల్లో నటించిన ‘భోగి’ సినిమా రెండు సార్లు వాయిదా పడ్డ తర్వాత విడుదలకు సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లో భోగి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 27న భారీ ఎత్తున విడుదల కాబోతున్న భోగి సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో మంచి ఓపెనింగ్స్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు విడుదల తేదీల సమయంలో పోటీ కాస్త ఎక్కువగానే ఉంది, కనుక ఆ సమయంలో విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా ఓపెనింగ్ కలెక్షన్స్ పై పెద్ద ప్రభావం పడి ఉండేది అనేది బాక్సాఫీస్ వర్గాల మాట. ఈ వారం కూడా భోగి కాకుండా కొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ భోగి తర్వాతే అవి అన్నట్లుగా ప్రేక్షకులు ప్రియారిటీ ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భోగి సినిమాకు కచ్చితంగా పెద్దగా పోటీ లేదని చెప్పవచ్చు.
శర్వానంద్ హీరోగా భోగి సినిమా...
సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచింది. పైగా ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ రావడంతో మాస్ ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు, రస్టిక్ సీన్స్ ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది రూపొందించాడని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో శర్వానంద్ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అందుకే ఈ సినిమాపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే మొదలైన బుకింగ్‌కి మంచి స్పందన వస్తున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. భోగి సినిమాకు అయిదు సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ ఓపెనింగ్ మాత్రం తగ్గక పోవచ్చు అనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
భోగి రిలీజ్ డేట్...
భోగి సినిమాతో పాటు నవంబర్ 27వ తారీకున విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన నాన్న కుట్టి విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తమిళ్ మూవీ కావడంతో డబ్బింగ్ వర్షన్ కు అంతగా హైప్ క్రియేట్ కాలేదని చెప్పక తప్పదు. అయితే విజయ్ ఆంటోనీ సినిమాలు ఇష్టపడే తెలుగు వారు మాత్రం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా హై, హే కన్నమ్మ, ఐ హేట్ మ్యారేజ్, డాడ్స్‌స్ లిటిల్ ప్రిన్సెస్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ చిన్న సినిమాల్లో ప్రస్తుతానికి పెద్దగా బజ్ లేకున్నా, విడుదల తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. విడుదల తర్వాత పోటీ ఉండే అవకాశం అయితే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్ విషయంలో భోగిని కొట్టే స్థాయిలో ఏ సినిమా సందడి చేయడం లేదు అనేది బాక్సాఫీస్ వర్గాల మాట.
విజయ్ ఆంటోనీ నటించిన నాన్న కుట్టి మూవీ...
శర్వానంద్‌ను గతంలో ఎప్పుడూ చూడని విధంగా దర్శకుడు సంపత్ నంది చూపించబోతున్నాడు. లుక్ మాత్రమే కాకుండా శర్వా బాడీ లాంగ్వేజ్ మార్చి మరీ ఈ సినిమాలో నటించాడు. 1960 కాలం నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఒక ఊరిలో ఈ కథ జరుగుతుంది. అప్పటి పద్దతులు, అప్పటి కట్టుబాట్లను ఈ సినిమాలో చూపించడం కోసం చాలా రీసెర్చ్ చేసినట్లు దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కమ్మరి గంగ పాత్ర కోసం శర్వానంద్ ఎంత కష్టపడ్డాడో ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. తప్పకుండా సినిమాలో ఆయన కష్టం మరింతగా కనిపించడం ఖాయం అని, శర్వానంద్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సినిమాకు చాలా సినిమాలు పోటీ ఉన్నప్పటికీ బజ్ ఈ సినిమాకే ఎక్కువ ఉన్న కారణంగా మొదటి వారం రోజులు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం.
