చంద్రబోస్ కలం నుంచి మరో సెంటిమెంట్ అస్త్రం
ఈ పాటకు మెయిన్ హైలైట్ ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం. పల్లెటూరి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తనదైన స్వచ్ఛమైన పదాలతో ఆయన రాసిన తీరు హృదయాలను హత్తుకుంటోంది.
By: M Prashanth | 20 Oct 2026 1:25 PM ISTటాలీవుడ్ లో ఇప్పుడు రూరల్ కంటెంట్ కు భలే డిమాండ్ ఉంది. పక్కా పల్లెటూరి నేపథ్యంతో వచ్చే సినిమాలను ఆడియన్స్ బాగా ఓన్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే పల్స్ పట్టుకుని శర్వానంద్, అనుపమ జంటగా నటిస్తున్న చిత్రం 'భోగి'. మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా 'అన్నయ్య పానంలో' అనే సెంటిమెంట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈ పాటకు మెయిన్ హైలైట్ ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం. పల్లెటూరి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తనదైన స్వచ్ఛమైన పదాలతో ఆయన రాసిన తీరు హృదయాలను హత్తుకుంటోంది. "అన్నయ్య పానంలో పూసిన పూవులు ఐదుగురు షెళ్లెల్లంట.. ఆ సిట్టి షెళ్లెల్ల తమ పంచపానాలు అన్నయ్య ఒకడేనంట" అంటూ ఆయన రాసిన లైన్స్ సినిమా సోల్ ఏంటో చెప్పేస్తున్నాయి.
ఎమోషన్ ను పండించడంలో చంద్రబోస్ మార్క్ ఈ పాటలో క్లియర్ గా కనిపించింది. ఇక చంద్రబోస్ రాసిన ఈ ఎమోషనల్ లైన్స్ కు సింగర్ శ్రీకృష్ణ వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. తనదైన మధురమైన గొంతుతో పాటలోని ఫీల్ ను ఎక్కడా తగ్గకుండా శ్రీకృష్ణ చాలా నేచురల్ గా పాడారు. దీనికి తోడు రూరల్ బ్యాక్ డ్రాప్ కు తగ్గట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన ట్యూన్ ఆకట్టుకునేలా ఉంది. పల్లెటూరి వాయిద్యాలతో ఆయన ఇచ్చిన సౌండింగ్ పాటకు ప్రాణం పోసింది.
విజువల్స్ విషయానికి వస్తే.. శర్వానంద్ పక్కా లోకల్ విలేజ్ కుర్రాడిగా, చెల్లెళ్ల కోసం బతికే అన్నయ్యగా చాలా నేచురల్ గా సెట్ అయ్యాడు. అనుపమ డీగ్లామర్ లుక్ తో పల్లెటూరి వాతావరణానికి తగ్గట్లుగా ఒదిగిపోయింది. యాక్షన్ సినిమాలే తీస్తాడన్న పేరున్న సంపత్ నంది.. ఈసారి ఒక బలమైన కుటుంబ భావోద్వేగాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడని ఈ వీడియో సాంగ్ చూస్తే అర్థమవుతోంది.
ఈ మధ్య టాలీవుడ్ లో బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు కాస్త తగ్గాయి. ఇలాంటి టైమ్ లో ఆ క్లాసిక్ ఫార్ములాను నమ్ముకుని ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేయడం మంచి స్ట్రాటజీనే. మాస్ తో పాటు ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయితే మాత్రం శర్వా ఖాతాలో హిట్ పడ్డట్లే. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ భారీ రూరల్ డ్రామాలో డింపుల్ హయాతి కూడా నటిస్తోంది. ఇక 'అన్నయ్య పానంలో' సాంగ్ భోగి సినిమా మీద మంచి అంచనాలే క్రియేట్ చేసింది. మ్యూజికల్ గా, విజువల్ గా పల్లెటూరి స్వచ్ఛతను తెరపైకి తెచ్చారు. అయితే ఈ ఎమోషనల్ కనెక్ట్ థియేటర్లలో ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చూడాలి.
