Begin typing your search above and press return to search.

శర్వా మాస్ అవతారం.. ‘భోగి’ మైండ్ బ్లోయింగ్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ అంటే మనకు గుర్తొచ్చేది ఆ క్లాస్ లుక్, పక్కింటి అబ్బాయిలా ఉండే మేనరిజమ్స్.

By:  M Prashanth   |   25 Feb 2026 10:47 AM IST
శర్వా మాస్ అవతారం.. ‘భోగి’ మైండ్ బ్లోయింగ్
X

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ అంటే మనకు గుర్తొచ్చేది ఆ క్లాస్ లుక్, పక్కింటి అబ్బాయిలా ఉండే మేనరిజమ్స్. కానీ, గత కొంతకాలంగా అతను ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే, తన ఇమేజ్‌ని కంప్లీట్‌గా మార్చేసుకుంటున్నారని అర్థమవుతోంది. ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న శర్వా, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న అప్‌డేట్స్ చూస్తుంటే, శర్వా నుండి ఒక అదిరిపోయే యాక్షన్ ట్రీట్ రాబోతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.





లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ బయటకు వచ్చింది. అసలు ఆ ఫోటోలో ఉన్నది శర్వానేనా అని ఆశ్చర్యపోయేలా ఆ మేకోవర్ ఉంది. సాధారణంగా కూల్‌గా కనిపించే ఈ హీరో, ఇందులో మాత్రం పక్కా మాస్ లుక్‌లో భయపెడుతున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న భారీ యాక్షన్ షెడ్యూల్‌లో శర్వా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే విడుదలైన ‘భోగి’ ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శర్వానంద్ ఎన్నడూ చూడని విధంగా చాలా రఫ్ అండ్ రగ్గడ్ అవతారంలో కనిపిస్తున్నారు. ఒత్తైన గడ్డం, మీసం, రింగుల జుట్టుతో లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. తన ముందు ఒక భారీ వేటకొడవలిని పెట్టుకుని, నిప్పులు చేరిగే కళ్లతో చూస్తున్న శర్వాను చూస్తుంటే సినిమాలో ‘బీస్ట్ మోడ్’ ఆన్ అయినట్లు స్పష్టమవుతోంది. ‘ఏ బ్లడ్ ఫెస్ట్’ అనే ట్యాగ్‌లైన్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయేలా ఈ లుక్ ఉంది. శర్వా కెరీర్‌లోనే ఇది మోస్ట్ మాస్ మేకోవర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ సినిమా 1960ల కాలం నాటి ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలం నాటి రస్టిక్ అండ్ రా ఫీల్ తీసుకురావడానికి మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదు. ఇప్పటికే దిలీప్ సుబ్బరాయన్ మాస్టర్ ఆధ్వర్యంలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. శర్వా మాస్ లుక్ చూస్తుంటే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రిచ్ టెక్నికల్ వాల్యూస్‌తో వస్తున్న ‘భోగి’ సినిమాను 2026 ఆగస్టు 28న రక్షాబంధన్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. శర్వానంద్ ఇలాంటి ఒక కంప్లీట్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించడం ఆడియెన్స్ కి ఒక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి. ‘భోగి’ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా హై రేంజ్ కి తీసుకెళ్లింది. శర్వా లుక్ హైలెట్ అవ్వడమే కాకుండా, పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి ఆగస్టు 28న శర్వానంద్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.