వారిద్దరి తర్వాత స్థానం అతడిదేనా?
సొంత ట్యాలెంట్ ని వదిలి పరభాషల నుంచి నటుల్ని, సంగీత దర్శకుల్ని తీసుకోవడం టాలీవుడ్ లో రెగ్యులర్ గా కనిపిస్తుంది.
By: Srikanth Kontham | 15 Nov 2025 2:00 PM ISTసొంత ట్యాలెంట్ ని వదిలి పరభాషల నుంచి నటుల్ని, సంగీత దర్శకుల్ని తీసుకోవడం టాలీవుడ్ లో రెగ్యులర్ గా కనిపిస్తుంది. అందుకు కారణాలు రకరకాలు అనుకోండి. సినిమా అంటే కోట్ల రూపాయలతో ముడిపడిన అంశం నచ్చిన వారిని పెట్టుకునే వెసులు బాటు ఉంటుంది. ఈ క్రమంలో సొంత పరిశ్రమలో వాళ్లకి అవకాశాలు రావడం లేదనే వాదన ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అవన్నీ దాటుకుని వస్తేనే తెలుగు వాళ్లకు అవకాశాలు వస్తాయి. నటులైనా? సంగీత దర్శకులైనా? ఎవరికైనా సరే! ఆరంభంలో ఇబ్బందులు...కష్టాలు తప్పవు.
లైనప్ ఆధారంగా స్థానం:
మ్యూజిక్ డైరెక్టర్లగా ఏల్తోన్న దేవీ శ్రీ ప్రసాద్, థమన్ లాంటి వారు సైతం అవన్నీ దాటుకుని వచ్చిన వారే. ప్రస్తుతం టాలీవుడ్ లో వారి స్థానాలు ఏంటి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లను సైతం పక్కన బెట్టి కొంత కాలంగా దేవీ, థమన్ లనే తీసుకుంటున్నారు. ఏ స్టార్ హీరో సినిమా తీసుకున్నా? వాళ్లిద్దరి లో ఎవరో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటున్నారు. తాజాగా వారి తర్వాత స్థానాన్ని యువ సంచలనం భీమ్స్ సెసిరోలియో దక్కించుకున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం లైనప్ లో భీమ్స్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇండస్ట్రీలో అతడి అనుభవం, పని చేసిన చిత్రాలు..తాజా లైనప్ చూస్తుంటే? విషయం క్లియర్ గా అర్దమవుతుంది.
మెగాస్టార్ పిలిచి అవకాశం:
భీమ్స్ 2012 లో తన కెరీర్ ప్రారంభించాడు. అటుపై 2015 లో రవి తేజ హీరోగా నటించిన ` బెంగాల్ టైగర్`తో సంగీత దర్శకుడిగా ఎంటర్ అయ్యాడు. ఆసినిమాకు మంచి సంగీతం అందించడంతో ఇప్పటికీ రవితేజా భీమ్స్ ని తన మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగిస్తున్నారు. 2022 లో రిలీజ్ అయిన `ధమాకా`కు తానే సంగీతం అందించాడు. తాజాగా రిలీజ్ అయిన `మాస్ జాతర`కు తానే స్వరాలు సమకూర్చాడు. ఇదే ఏడాది రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో భీమ్స్ ఓ సంచలనంలా మారాడు. ఆ సినిమాలో పాటలన్నీ చార్ బస్టర్ గా నిలిచాయి.
టాలీవుడ్ లో పుల్ బిజీగా:
`గోదారి గట్టు` సాంగ్ తో ఇండియానే ఊపేసాడు. ఈ పాటతో బాలీవుడ్ లోనూ ఫేమస్ అయ్యాడు. దీంతో చిరంజీవి పిలిచి మరీ తన 157వ సినిమాకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం భీమ్స్ లైనప్ మామూలుగా లేదు. పన్నెండు సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అల్లరి నరేశ్ నటిస్తోన్న `12 ఏ రైల్వే కాలనీ`, బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా `టైసన్ నాయుడు`కి సంగీతం అందిస్తున్నాడు. అలాగే రవితేజ నటిస్తోన్న మరో చిత్రం `భర్త మహాశయులకు` తానే సంగీతం సమకూర్చుతున్నాడు. ఇంకా శర్వానంద్, సంపత్ నంది చిత్రానికి, అడవి శేష్ `డెకాయిట్` కు తాను మ్యూజిక్ డైరెక్టర్. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న `ఫంకీ`, సిద్దు జొన్నల గడ్డ కొత్త ప్రాజెక్ట్ లకు భీమ్స్ నే బాణీలు అందిస్తున్నాడు.
