Begin typing your search above and press return to search.

వీడియో : హీట్‌ పెంచేలా 'పరమ్‌ సుందరి' రొమాంటిక్‌ నెంబర్‌

భీగి శారీ అంటూ సాగుతున్న ఈ పాటలో జాన్వీ కపూర్‌ అందం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

By:  Ramesh Palla   |   8 Aug 2025 3:56 PM IST
వీడియో : హీట్‌ పెంచేలా పరమ్‌ సుందరి రొమాంటిక్‌ నెంబర్‌
X

సిద్దార్థ్‌ మల్హోత్ర హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన 'పరమ్‌ సుందరి' పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ స్టఫ్ సినిమాపై అంచనాలు పెంచాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తుంది. మొదటి నుంచి విడుదల చేసిన పోస్టర్స్‌లో జాన్వీ కపూర్‌ అందం ఆకట్టుకుంటూ వచ్చింది. అందుకే జాన్వీ కపూర్‌ ఫ్యాన్స్‌కి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక యంగ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రతో జాన్వీ కపూర్ చేసిన రొమాన్స్ సినిమాను మరో లెవల్‌లో నిలపడం ఖాయం అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా పరమ్‌ సుందరి నుంచి రొమాంటిక్ నెంబర్‌ వచ్చింది. సిద్దార్థ్‌ మల్హోత్ర, జాన్వీ కపూర్‌ల ఈ రొమాంటిక్ సాంగ్‌ సోషల్‌ మీడియాను కుదిపేస్తుంది.

జాన్వీ కపూర్ రెయిన్‌ డాన్స్‌

భీగి శారీ అంటూ సాగుతున్న ఈ పాటలో జాన్వీ కపూర్‌ అందం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. వర్షంలో తడుస్తూ హీరో, హీరోయిన్‌ చేసిన ఈ పాట హీట్‌ పెంచేలా ఉంది. చాలా కాలం తర్వాత ఒక రెయిన్‌ సాంగ్‌కి ఈ రేంజ్‌ రెస్పాన్స్ దక్కింది. సినిమా స్థాయిని ఈ పాట కచ్చితంగా రెట్టింపు చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట కారణంగా సినిమా బిజినెస్ కూడా ఖచ్చితంగా పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి గతంలో చేసిన రెయిన్‌ డాన్స్‌లతో ఈ పాటను పోల్చుతూ జాన్వీ కపూర్‌ అందంను అభివర్ణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మొత్తానికి పరమ్‌ సుందరిలోని ఈ పాట ముందు ముందు రోజుల్లో తెగ హడావడి చేయడం కన్ఫర్మ్‌గా ఉంది.

సిద్దార్థ్‌ మల్హోత్ర, జాన్వీ కపూర్‌ల రొమాన్స్‌

తుషార్‌ జలోటా దర్శకత్వంలో ఈ సినిమాను మాడాక్‌ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్‌ నిర్మించారు. హిందీలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం సిద్దార్థ్‌ మల్హోత్ర, జాన్వీ కపూర్‌ లు మొదటి సారి కలిసి నటించారు. మొదటి సారి వీరిద్దరి కలయిక అయినా కూడా మంచి బజ్‌ ను క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు. సినిమా విడుదల తర్వాత వీరి జోడీకి మంచి పేరు రావడం మాత్రమే కాకుండా ముందు ముందు మరిన్ని సినిమాలు వీరి కాంబోలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది సినీ విశ్లేషకుల మాట. ఈ సినిమాను ఆగస్టు 29న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఉన్న బజ్‌ ను మరింత పెంచే విధంగా పాటలను, ట్రైలర్‌ ను విడుదల చేయడంతో పాటు, ప్రమోషన్‌ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలను మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

హిందీతో పాటు సౌత్‌ భాషల్లోనూ..!

ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం కేరళలోని అందమైన ప్రదేశాల్లో చేశారు. అందుకే ఈ సినిమా కు హిందీ ప్రేక్షకులతో పాటు కేరళ ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమాకు వచ్చే టాక్‌ను అనుసారం హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, మలయాళంలోనూ డబ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్‌కి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో తెలుగు, తమిళ్‌ భాషల్లో హిందీ రిలీజ్ సమయంలోనే డబ్‌ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. కానీ మేకర్స్‌ నుంచి ఇప్పటి వరకు డబ్బింగ్‌ కు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. కొందరు సౌత్ మేకర్స్‌ డబ్బింగ్‌ రైట్స్ కోసం ఇప్పటికే సంప్రదించారని తెలుస్తోంది. పరమ్‌ సుందరి ఆ మధ్య వచ్చిన సయ్యారా సినిమా మాదిరిగా భారీ రొమాంటిక్ కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.