Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. సెకండ్ ఎలిమినేషన్ షాకింగ్..!

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీకెండ్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చారు. ఆల్రెడీ శనివారం ఎపిసోడ్ లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు.

By:  Ramesh Boddu   |   14 Dec 2025 1:44 PM IST
బిగ్ బాస్ 9.. సెకండ్ ఎలిమినేషన్ షాకింగ్..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీకెండ్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చారు. ఆల్రెడీ శనివారం ఎపిసోడ్ లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు. హౌస్ లో లాస్ట్ వీక్ కళ్యాణ్ తప్ప అందరు నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో లీస్ట్ ఓటింగ్ ఉన్న సుమన్ శెట్టిని నిన్న హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఐతే సుమన్ శెట్టితో పాటు డబల్ ఎలిమినేషన్ లో ఎవరు బయటకు వస్తారా అన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.

ఆరుగురిలో అందరు స్ట్రాంగ్ గా ఉండగా..

హౌస్ లో ఉన్న మిగతా ఆరుగురిలో అందరు స్ట్రాంగ్ గా ఉండగా కేవలం ఒక ఇద్దరిలో ఈ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని ఫిక్స్ అయ్యారు. వారిలో సంజన, భరణి లీస్ట్ లో ఉన్నారు. ఐతే సీజన్ 9లో ఆడియన్స్ అంతా కూడా మొదటి నుంచి వారి ఆటని చూసి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారికి ఓట్ వేశారని అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ వారం భరణి, సంజనా లల్లో సంజనాని సేఫ్ చేసి భరణిని ఎలిమినేట్ అయ్యేలా చేశారు.

భరణి ఆల్రెడీ ఈ సీజన్ లో ఒకసారి ఎలిమినేట్ అయ్యాడు. ఐతే అతని ఎలిమినేషన్ ఆడియన్స్ లో కొంత అసంతృప్తి వచ్చింది. అందుకే శ్రీజ, భరణి ఇద్దరిని హౌస్ లోకి పంపించి మళ్లీ ఆడియన్స్ ఓటింగ్ పోల్ పెట్టి భరణిని హౌస్ లో కొనసాగేలా చేశారు. ఐతే భరణి రీ ఎంట్రీ తర్వాత తన ఫన్ యాంగిల్ చూపించాడు.

ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా..

మొదట్లో మొత్తం తనూజ, దివ్యల మధ్య నలిగిపోతూ కనిపించాడు. ఇక ఫైనల్ గా సీజన్ 9లో ఈరోజు భరణి ఎలిమినేట్ అవుతున్నాడు. ఫైనల్ వీక్ దాకా భరణి కూడా ఉంటాడని అతని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అతను ఆల్రెడీ బయటకు ఒకసారి వెళ్లి వచ్చాడు కాబట్టి సంజనాని టాప్ 5కి పంపించడమే కరెక్ట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. సో బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా భరణి మరోసారి ఎలిమినేట్ అవుతున్నాడని తెలుస్తుంది.

గత మూడు వారాల నుంచి భరణి మిగతా హౌస్ మేట్స్ తో అంతా సర్దాగా ఉన్నాడు. టాస్క్ లు కూడా బాగానే ఆడాడు. ఐతే ఇదేదో ముందు నుంచి ఇలానే ఉంటే అతను టాప్ 3లో కచ్చితంగా ఉండే అవకాశం ఉండేది. మరో పక్క శనివారం ఎపిసోడ్ లోనే సుమన్, భరణి ఎలిమినేషన్ అని హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. శనివరం ఎపిసోడ్ లో సుమన్, భరణి ఫ్రెండ్ షిప్ మీద ముస్తఫ్ఫా సాంగ్ వేసి మరీ ఒక వీడియో చూపించారు నాగార్జున. సో సుమన్ తో పాటు భరణి ఎలిమినేషన్ అనే హింట్ అప్పుడే ఇచ్చారన్నమాట.