సైలెంట్‌గా రాజమౌళికి చెక్ పెడుతున్న దర్శకుడు!?
అలాంటి వారిలో కళాత్మక దర్శకుడు భన్సాలీ కూడా ఉన్నారు. భారతదేశంలోని అత్యుత్తమ దర్శకులలో ఒకరిగా పాపులరైన భన్సాలీ గురించి ఇప్పుడే పరిచయం అసరం లేదు.
By: Sivaji Kontham | 4 Sept 2025 9:38 AM ISTఇది పోటీ ప్రపంచం.. ఇక్కడ పోటీ ఎప్పుడూ నివరుగప్పిన నిప్పులా ఉంటుంది. టచ్ చేస్తే కాల్తుంది! కొందరు పాపులర్ దర్శకులు తమ మనుగడకు భంగం కలగకుండా, రేస్ లో ఎప్పుడూ తమను తాము ఇతరుల కంటే అత్యుత్తమంగా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. సాంకేతికంగా ది బెస్ట్ ఇవ్వాలి. కథాంశం, పాత్రల చిత్రణ, విజువల్స్ నాణ్యత పరంగాను ది బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు.
అలాంటి వారిలో కళాత్మక దర్శకుడు భన్సాలీ కూడా ఉన్నారు. భారతదేశంలోని అత్యుత్తమ దర్శకులలో ఒకరిగా పాపులరైన భన్సాలీ గురించి ఇప్పుడే పరిచయం అసరం లేదు. ఆయన తన జానర్, తన యూనిక్ స్టైల్ ని విడిచి పెట్టకుండానే, ఇతర స్టార్ డైరెక్టర్లకు కాంపిటీటర్ గా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రాన్ని ఏ ఇతర పాన్ ఇండియా (వరల్డ్) సినిమాకి తగ్గకుండా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో లవ్ , వార్ అనే కాంప్లికేటెడ్ అంశాల్ని అత్యంత భావోద్వేగ అంశాలుగా ఎలివేట్ చేస్తూ, భారీ డ్రామాతో రక్తి కట్టించబోతున్నారని సమాచారం.
ఇది ముక్కోణ ప్రేమకథ.. మరో వైపు వార్ డ్రామా రన్ అవుతుంది. యువతరం సహా ఫ్యామిలీ ఆడియెన్ ని మాస్‌ని కూడా థియేటర్లకు రప్పించేందుకు ఉద్ధేశించిన సినిమా ఇది. పైగా ఇది యూనివర్శల్ అప్పీల్ - యాక్సెప్టెన్సీ ఉన్న కథాంశం అని కూడా చెబుతున్నారు. రణబీర్ కపూర్- ఆలియా భట్- విక్కీ కౌశల్ మధ్య ముక్కోణ ప్రేమకథలో భావోద్వేగాల్ని తెరపై అద్భుతంగా ఎలివేట్ చేసేందుకు భన్సాలీ చాలా గ్రౌండ్ వర్క్ చేసారు. ఓ వైపు దేశాల మధ్య యుద్ధం సాగుతుంటే, యువతీ యువకుల మధ్య ముక్కోణ ప్రేమ కథ అంతే హృద్యంగా సాగుతుంది. ఒక రకంగా కుర్చీ అంచుమీదకు జారేంత సీట్ ఎడ్జ్ థ్రిల్స్‌ని కూడా ఈ సినిమా ఇవ్వబోతోందని గుసగుస వినిపిస్తోంది.
ప్రస్తుతం లవ్ అండ్ వార్ క్లైమాక్స్ చిత్రీకరణ ఇటలీ సిసిలీలో పూర్తవుతోంది. 125 రోజుల పాటు చిత్రీకరణ అనంతరం ఇప్పుడు భన్సాలీ టీమ్ విదేశీ షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. సిసిలీలో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బాలీవుడ్ హంగామా పేర్కొంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ డ్రమటిగ్గా రక్తి కట్టించబోతోంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు ఉద్వేగాన్ని కలిగిస్తాయి. చలించిపోయే హార్ట్ బ్రేకింగ్ సన్నివేశాలతో భన్సాలీ సినిమా రక్తి కట్టించబోతోంది. ఇటలీ దేశంలోని సిసిలీ నగరంలో సుదీర్ఘ షెడ్యూల్ ని పూర్తి చేస్తారు. అక్కడ అందమైన ప్రకృతి లో కీలక సన్నివేశాల్ని పూర్తి చేస్తారు. నెల రోజుల పాటు ఇటలీలోనే ఉండి ఒక పాట, దాంతో పాటే క్లైమాక్స్ ని పూర్తి చేస్తారని సమాచారం. 2026 మార్చి 26న లవ్ అండ్ వార్ విడుదల కానుంది.
భన్సాలీ ప్రయత్నం చూస్తుంటే, పాన్ వరల్డ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే బలమైన సంకల్పం కనిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి - మహేష్ బాబు కాంబో ఎస్.ఎస్.ఎం.బి 29 , అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ సైన్స్ ఫిక్షన్ మూవీ, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మాఫియా యాక్షన్ డ్రామా డ్రాగన్, ప్రభాస్- నాగ్ అశ్విన్ కల్కి 2898 సీక్వెల్ లతో పోటీపడుతూ అంతర్జాతీయ మార్కెట్లో సత్తా చాటాలని భన్సాలీ ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. చూస్తుంటే, భారతదేశంలో నంబర్ వన్ హోదాలో కొనసాగుతున్న రాజమౌళికే చెక్ పెట్టాలనే ప్రయత్నం భన్సాలీలో కనిపిస్తోంది. అయితే ఆయన కళాత్మక పంథా శ్రుతిమించితే ఎప్పటిలానే మాస్ ఆడియెన్‌ని థియేటర్లకు రప్పించడం బహు కష్టం!!
