భాగ్య శ్రీ రిజల్ట్.. ఆంధ్రా కింగ్ ఆసక్తి..!
బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ ఆ సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేసినా కూడా టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు అందుకుంది.
By: Ramesh Boddu | 29 July 2025 8:00 PM ISTబచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ ఆ సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేసినా కూడా టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు అందుకుంది. విజయ్ దేవరకొండ కింగ్ డమ్, రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా ఈ రెండు సినిమాలు అమ్మడికి లక్కీగా మారబోతున్నాయి. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో భాగ్య శ్రీకి కూడా మంచి స్కోప్ ఉన్న రోల్ దొరికినట్టే ఉంది. గౌతమ్ తిన్ననూరి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి వెయిట్ ఉంటుంది.
రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా..
భాగ్య శ్రీకి కూడా కింగ్ డమ్ లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర పడిందని తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక భాగ్య శ్రీ ఎంత ఇంపాక్ట్ చూపించింది అన్నది తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేస్తుంది భాగ్య శ్రీ. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో రామ్ లవర్ గా అమ్మడు కనిపిస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ నువ్వుంటే చాలే సూపర్ హిట్ అయ్యింది.
ఐతే కింగ్ డమ్ రిజల్ట్ ని బట్టి భాగ్య శ్రీ క్రేజ్ రామ్ ఆంధ్రా కింగ్ తాలూకాకి కలిసి వస్తుందని చెప్పొచ్చు. భాగ్య శ్రీ మాత్రం కింగ్ డమ్ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. కింగ్ డమ్ హిట్టు పడింది అంటే మాత్రం అటు రామ్ కూడా సూపర్ హ్యాపీ అవుతాడు. ఎందుకంటే కింగ్ డమ్ హీరోయిన్ హిట్ లక్ తన సినిమాకు కలిసి వస్తుందని నమ్ముతాడు. అదీగాక రామ్, భాగ్య శ్రీ జోడీ కూడా చాలా బాగుంది.
కింగ్ డమ్ హిట్ బూస్టింగ్..
ఈ సినిమా టైం లోనే రామ్ భాగ్య శ్రీని ఇష్టపడ్డాడంటూ కూడా హడావిడి చేశారు. ఏది ఏమైనా ఆంధ్రా కింగ్ కి కింగ్ డమ్ హిట్ నిజంగానే బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. భాగ్య శ్రీ టాలీవుడ్ కెరీర్ కూడా కింగ్డం రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అమ్మడు హిట్ ఖాతా తెరిస్తే మాత్రం ఇక వద్దన్నా సరే ఆఫర్లు వచ్చి ఆమె ముంగిట వాలేలా ఉన్నాయి.
మరి భాగ్య శ్రీ లక్ ఎలా ఉందో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. కింగ్ డమ్ ఈవెంట్స్ లో అయితే భాగ్య శ్రీ అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. స్టార్ హీరోయిన్ కటౌట్ అంటూ అమ్మడి గురించి సొషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.
