సైమా బెస్ట్ డెబ్యూగా భాగ్యశ్రీ.. ఇది ఆరంభం మాత్రమే!
దీంతో సోషల్ మీడియాలో ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు నెటిజన్లు, సినీ ప్రియులు. అదే సమయంలో ఔరంగాబాద్ కు చెందిన అమ్మడు.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు కృషి చేస్తుందని చెప్పాలి.
By: M Prashanth | 7 Sept 2025 1:41 PM ISTదుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) అవార్డుల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొలి రోజు 2024కి గాను తెలుగు చిత్రాల్లో టాలెంట్ తో ఆకట్టుకున్న నటీనటులు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే ఉత్తమ డెబ్యూ హీరోయిన్ గా అవార్డు దక్కించుకున్నారు.
దీంతో సోషల్ మీడియాలో ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు నెటిజన్లు, సినీ ప్రియులు. అదే సమయంలో ఔరంగాబాద్ కు చెందిన అమ్మడు.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు కృషి చేస్తుందని చెప్పాలి. వచ్చిన అవకాశాలను అందుకుంటున్న బ్యూటీ.. నటించిన ప్రతి సినిమాతో కూడా ముద్ర వేసేందుకు ఆసక్తిగా ఉంది అమ్మడు.
ఇప్పుడు సైమా అవార్డు గెలుచుకోవడం టాలెంటెడ్ హీరోయిన్ గా మంచి ఆరంభమనే చెప్పాలి. ఇంకా ఎన్నో సినిమాల్లో నటించాలని.. భారీ హిట్స్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. అప్ కమింగ్ ప్రాజెక్టులతో మంచి హిట్స్ అందుకోవాలని చెబుతున్నారు.
అయితే హిందీలో యారియాన్ 2 సినిమాతో తెరంగేట్రం చేసింది భాగ్యశ్రీ బోర్సే. ఆ తర్వాత చందు ఛాంపియన్ సినిమాలో ఓ పాత్రలో నటించిన అమ్మడు.. అనంతరం టాలీవుడ్ లో మకాం వేసింది. మాస్ మహా రాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ చేసిన భాగ్యశ్రీ.. రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కింగ్డమ్ సినిమా చేసింది భాగ్యశ్రీ.
కానీ ఆ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అయినా ముద్దుగుమ్మకు క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో యాక్ట్ చేస్తోంది అమ్మడు. రామ్ తో డేటింగ్ లో ఉందని ఆ మధ్య పుకార్లు వచ్చాయి. అందులో నిజం లేకపోయినా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.
అదే సమయంలో మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ తో పాన్ ఇండియా ఫిల్మ్ కాంతలో నటిస్తోంది. ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ లో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. మరి కొత్త సినిమాలో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో వేచి చూడాలి.
