ఫిల్మ్ నగర్ టెంపుల్.. మిస్టర్ బచ్చన్ బ్యూటీకి చాలా స్పెషల్!
మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. అదేనండీ భాగ్యశ్రీ బొర్సే. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లోకి వచ్చింది అమ్మడు.
By: M Prashanth | 23 Aug 2025 1:25 PM ISTమిస్టర్ బచ్చన్ బ్యూటీ.. అదేనండీ భాగ్యశ్రీ బొర్సే. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లోకి వచ్చింది అమ్మడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ బ్యూటీ అందరినీ ఫిదా చేసిందని చెప్పాలి. తొలి చిత్రంలోనే గ్లామర్ షో తో పాటు అభినయంతో కట్టిపడేసింది వయ్యారి.
ఆ తర్వాత రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీలో నటించగా.. ఆ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. అది పక్కన పెడితే.. భాగ్యశ్రీకి సరైన గుర్తింపు ఉన్న రోల్ దక్కలేదు. మేకర్స్ స్క్రీన్ స్పేస్ కూడా ఇవ్వలేదు. అయితేనేం ఉన్న కాసేపు అయినా.. తన అందంతో వయ్యారి ఫిదా చేసిందనే చెప్పాలి.
అయితే తెలుగులో తొలి రెండు చిత్రాలు హిట్ అవ్వకపోయినా.. ఆమె క్రేజ్ మాత్రం అలానే ఉంది. వరుస ఆఫర్స్ ఆమె సొంతమవుతున్నాయి. హీరోయిన్ గా బ్యూటీ మూడో చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా.. నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎనర్జిటిక్ రామ్ నటిస్తున్న ఆ సినిమాలో కాలేజీ అమ్మాయి రోల్ లో సందడి చేయనుంది.
ఆ తర్వాత మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు-మలయాళ ద్విభాషా చిత్రం కాంతలో నటిస్తున్న అమ్మడు.. అక్కినేని అఖిల్ లెనిన్ మూవీకి కూడా వర్క్ చేస్తోంది. ఇప్పటి వరకు ఒక్క హిట్ అందుకోకపోయినా.. వరుస ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తూ బిజీగా గడుపుతోంది. భారీ విజయాలు సొంతం చేసుకోవాలని చూస్తోంది.
అదే సమయంలో ఆమె రీసెంట్ పోస్ట్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. భాగ్యశ్రీ తన హృదయానికి దగ్గరగా ఉన్న ఆలయానికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. ఫిల్మ్ నగర్ లో రామానాయుడు స్టూడియోస్ లో ఉన్న ఆలయం వెలుపల దిగిన పిక్ ను షేర్ చేశారు. అంతేకాదు.. మంచి విషయాన్ని కూడా వెల్లడించారు,.
పరిశ్రమలో తన ప్రయాణం అక్కడి ప్రార్థనలతో ప్రారంభమైందని వెల్లడించింది భాగ్యశ్రీ. ఆ పిక్ లో బ్లాక్ కలర్ చుడీదార్ లో ఉన్న అమ్మడు.. అచ్చం కుందనపు బొమ్మలా కనిపిస్తుంది. నుదుటన కుంకుమ ఆమె అందాన్ని మరింత పెంచింది. అయితే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఆమెకు ఉండాలని, అప్ కమింగ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకోవాలని ఫ్యాన్స్, నెటిజన్లు కోరుకుంటున్నారు.
